ఫోన్‌లో రికార్డ్‌ చేయండి..వెబ్‌లో వినండి

పిక్సెల్ ఫోన్ యూజర్స్‌ కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఫోన్‌లో రికార్డ్‌ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని వెబ్‌ పేజీలో వినొచ్చు. ఈ వెబ్‌ అప్లికేషన్‌లో పిక్సెల్ ఫోన్‌ యూజర్స్‌కి తమ ఆడియో ఫైల్స్‌ని... 

Published : 25 Feb 2021 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిక్సెల్ ఫోన్ యూజర్స్‌ కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఫోన్‌లో రికార్డ్‌ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని వెబ్‌ పేజీలో వినొచ్చు. ‘గూగుల్ రికార్డర్’ పేరుతో తీసుకొస్తున్న ఈ వెబ్‌ అప్లికేషన్‌లో పిక్సెల్ ఫోన్‌ యూజర్స్‌కి తమ ఆడియో ఫైల్స్‌ని మొబైల్/డెస్క్‌టాప్‌ల ప్లే చెయ్యొచ్చు. బ్రౌజర్‌లో Recorder.Google.com అని టైప్ చేస్తే గూగుల్ రికార్డర్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో మీకు కావాల్సిన వాయిస్ క్లిప్‌లను వినడమే కాకుండా ఎక్కువ నిడివి ఉన్న ఆడియో ఫైల్స్‌ని, ఇంటర్వ్యూలను సులభంగా వెతికి ట్యాగ్ చేసి షేర్ చెయ్యొచ్చు. అలానే ఆడియో ఫైల్స్‌ని టెక్ట్స్‌ ఆధారంగా ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్‌తో రికార్డ్ చేసిన ఆడియో క్లిప్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్‌ని ఇతర ఫోన్ యూజర్స్‌కి కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని