Malware: ఈ 9 యాప్స్‌ ఉంటే తీసేయండి!

వినియోగదారుల డేటా భద్రత కోసం టెక్ కంపెనీలు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా..హ్యాకర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లోని 9 ఫొటో ఎడిటింగ్ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్‌ యూజర్స్‌ లాగిన్‌, పాస్‌వర్డ్‌లను సేకరిస్తున్నట్లు డాక్టర్‌ వెబ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన మాల్‌వేర్ అనలిస్ట్ విభాగం వెల్లడించింది.

Published : 04 Jul 2021 18:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారుల డేటా భద్రత కోసం టెక్ కంపెనీలు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా.. హ్యాకర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లోని 9 ఫొటో ఎడిటింగ్ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్‌ యూజర్స్‌ లాగిన్‌, పాస్‌వర్డ్‌లను సేకరిస్తున్నట్లు డాక్టర్‌ వెబ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన మాల్‌వేర్ అనలిస్ట్ విభాగం వెల్లడించింది. దీంతో గూగుల్‌ ఆ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్రత్యేకమైన సాంకేతిక సాయంతో హ్యాకర్స్‌ యాప్‌లలోకి ప్రవేశించి సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తున్నట్లు గుర్తించామని డాక్టర్ వెబ్‌ వెల్లడించింది.

తర్వాత WebView.Next పేరుతో జావాస్క్రిప్ట్‌ సాయంతో ఫేస్‌బుక్ పేజీలో మార్పులు చేసి..యూజర్స్ లాగిన్‌, పాస్‌వర్డ్ వివరాలను సేకరించి ట్రాజన్‌ యాప్స్‌ ద్వారా తమ సర్వర్లో సేవ్‌ చేసుకుంటున్నారని తెలిపింది. యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్‌ అయినప్పుడు కుకీస్‌తో పాటు ఇతర డేటా వివరాలను సేకరించి సైబర్‌ నేరగాళ్లకు అందజేస్తున్నారని డాక్టర్‌ వెబ్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ యాప్‌లకు 10 లక్షల నుంచి 50 లక్షల డౌన్‌లోడ్ జరిగినట్లు తెలిపింది. అందుకే ఈ యాప్‌లను యూజర్స్ వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సూచించింది. వీటితోపాటు ఈ యాప్‌లకు అనుబంధంగా ఉన్న యాప్‌లను డిలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. 

గూగుల్ తొలగించిన యాప్‌లు ఇవే..

పిఐపి ఫొటో (PIP Photo)

ప్రాసెసింగ్ ఫొటో (Processing Photo) 

రబ్బిష్ క్లీనర్ (Rubbish Cleaner)

హారోస్కోప్ డైలీ (Horoscope Daily)

ఇన్‌వెల్‌ ఫిట్‌నెస్‌ (Inwell Fitness)

యాప్‌ లాక్ కీప్‌ (App Loc Keep)

లాకిట్ మాస్టర్‌ (Lockit Master)

హారోస్కోప్‌ పై (Horoscope Pi)

యాప్‌ లాక్ మేనేజర్‌ (App Lock Manager)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని