
Android Smartphones: ఈ గూగుల్ యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయవు.. ఎందుకంటే?
ఇంటర్నెట్‌డెస్క్: మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే ఎంతో ఆశతో కొనుగోలు చేస్తాం. మరి ఆ మోడల్ ఎంతకాలం ఉపయోగిస్తారు? ఏడాది.. రెండేళ్లు.. అంతే తర్వాత పాత ఫోన్ బోర్ కొట్టి మరో కొత్త మోడల్‌ను కొనుగోలు చేస్తాం. కానీ కొంత మంది మాత్రం ఏళ్ల తరబడి ఒకే ఫోన్ వాడుతుంటారు. అయితే వాటిలో కొత్తగా వచ్చే సెక్యూరిటీ అప్డేట్స్తోపాటు ఇతర ఫీచర్లు అప్డేట్ కావు. కొద్ది రోజుల క్రితం వాట్సాప్ కొన్ని పాత మోడల్ ఫోన్లలో నవంబరు 2021 నుంచి తమ సేవలు ఆగిపోనున్నాయని ప్రకటించింది. ఇప్పుడు గూగుల్ కూడా ఆండ్రాయిడ్ పాత వెర్షన్ ఫోన్లలో కొన్ని యాప్‌ల సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది.
ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న స్మార్ట్ఫోన్లలో గూగుల్ మ్యాప్, జీమెయిల్, యూట్యూబ్ యాప్‌లు పనిచేయవని గూగుల్ తెలిపింది. ఒకవేళ యూజర్స్ లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సైన్ఇన్ ఎర్రర్ అనే మెసేజ్ కనిపిస్తుందని వెల్లడించింది. ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ పేరుతో 2010 డిసెంబరులో ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌ని స్టార్ట్ చేశారు. సుమారు 11 ఏళ్ల తర్వాత ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌కి గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, గూగుల్ క్యాలెండర్, యూట్యూబ్, గూగుల్ ప్లేస్టోర్ యాప్‌ల సేవలు నిలిపివేయనుంది. యూజర్స్‌కి భద్రతపరంగా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. 2017లోనే గూగుల్ ఈ వెర్షన్ ఓఎస్‌కు గూగుల్ పే సేవలు నిలిపివేసింది. ఈ యాప్‌ల సేవలు పొందాలనుకునే యూజర్స్ తమ ఫోన్లలో ఓఎస్‌ను ఆండ్రాయిడ్ 3.0 లేదా లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.