Google Messages: మరో రెండు సరికొత్త ఫీచర్లతో..

రోజూ మన ఫోన్‌కు ఎన్నో రకాల మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో స్నేహితులు, బంధుమిత్రులు పంపేవే కాకుండా వాణిజ్యపరమైనవి. అందులో మనకు అనవసరమైన వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే ఎంతో కొంత సమయం కేటాయించాల్సిందే. దీనికి పరిష్కారంగా గూగుల్‌ మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికతతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

Published : 29 Jun 2021 20:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజూ మన ఫోన్‌కు ఎన్నో రకాల మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో స్నేహితులు, బంధుమిత్రులు పంపేవే కాకుండా వాణిజ్యపరమైనవి. అందులో మనకు అనవసరమైన వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే ఎంతో కొంత సమయం కేటాయించాల్సిందే. దీనికి పరిష్కారంగా గూగుల్‌ మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికతతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇది మెసేజ్‌లను కేటగిరీల వారీగా విభజిస్తుంది. అంటే వ్యక్తిగతమైనవి, ఓటీపీలు, బ్యాంక్‌ లావాదేవీలు వంటి వాటిని కేటగిరీలుగా విభజించి ఆయా ఫోల్డర్లలోకి పంపిస్తుంది. దీని వల్ల యూజర్స్ తమకు అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందుతారని గూగుల్ వెల్లడించింది.

దీంతోపాటు గూగుల్ మెసేజింగ్ యాప్‌కు మరో కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. ఇందులో మెసేజ్‌ ఇన్‌బాక్స్‌కు వచ్చే ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌)లు 24 గంటల వ్యవధిలో వాటంతటవే డిలీట్‌ అవుతాయని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌ కోసం ఫోన్‌ స్క్రీన్‌ మీద మెసేజింగ్ యాప్‌కు సంబంధించి సలహాలతో కూడిన పాప్‌-అప్ విండో ప్రత్యక్షమైనప్పుడు కంటిన్యూ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌ 8 ఓఎస్‌ లేదా ఆపై వెర్షన్ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుందని తెలిపింది. యూజర్‌కి మెరుగైన సేవలందించడం కోసం ఈ ఫీచర్లును తీసుకొచ్చామని..వీటిని ఉపయోగించాలా..వద్దా అనే ఐచ్ఛికాన్ని యూజర్‌ ఎంపిక చేసుకోవచ్చని గూగుల్ చెప్పింది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్పులు చేసుకోవాలని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని