Google Pixel 7: రెండు వేరియంట్లలో గూగుల్‌ పిక్సెల్‌ 7.. విడుదల ఎప్పుడంటే?

పిక్సెల్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు గూగుల్ కంపెనీ సిద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్‌ 7 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Published : 28 Feb 2022 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పిక్సెల్‌ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ విడుదల చేయనుంది. కొద్ది నెలల క్రితం విడుదల చేసిన పిక్సెల్‌ 6 (Pixel 6) సిరీస్‌కు కొనసాగింపుగా పిక్సెల్‌ 7 (Pixel 7) మోడల్‌ను తీసుకురానుంది. రెండు వేరియంట్లలో పిక్సెల్‌ 7 వస్తుందని సమాచారం. గూగుల్ కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌ మోడల్‌ ధ్రువీకరణ కోసం జీఎక్స్‌7ఏఎస్‌ (GX7AS) కోడ్‌ నేమ్‌తో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది.  పిక్సెల్‌ 7 ప్రో మోడల్‌లో 6.7 అంగుళాలు లేదా 6.8 అంగుళాల కర్వ్‌డ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, పిక్సెల్‌ 7లో 6.2 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారట.

ఈ ఫోన్లలో గూగుల్ కొత్తగా అభివృద్ధి చేసిన టెన్స్‌ర్‌ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారని సమారం. ఈ ప్రాసెసర్‌ను తొలిసారి పిక్సెల్ 6 సిరీస్‌ ఫోన్లలో గూగుల్ పరిచయం చేసింది. ఈ ఫోన్లలో వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారట. డిజైన్‌ పరంగా పిక్సెల్‌ 7లో పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13తో పనిచేస్తుందట. ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయని సమాచారం. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ, 512 జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారట. ఈ మోడల్‌ను పిక్సెల్‌ 6ఏ (Pixel 6A) పేరుతో భారత్‌లోకి విడుదల చేస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.

పిక్సెల్‌ 4ఏ (Pixel 4A) తర్వాత విడుదలైన పిక్సెల్‌ 5 సిరీస్‌, పిక్సెల్‌ 6 సిరీస్‌ మోడల్స్‌ను గూగుల్ కంపెనీ భారత్‌లో విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పిక్సెల్‌ 7వ జనరేషన్‌ను పిక్సెల్‌ 6ఏ పేరుతో ఈ ఏడాది ద్వితీయార్థంలో భారత మార్కెట్లో పరిచయం చేయాలని గూగుల్ భావిస్తున్నట్లు టెక్ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు