Google: 16 ఏళ్ల బుక్‌మార్క్స్ సేవలకు సెలవు

పీసీ లేదా మొబైల్‌లో బ్రౌజింగ్ చేసేప్పుడు మనకు నచ్చిన పేజ్‌ లేదా వెబ్‌సైట్‌ను భవిష్యత్తు అవసరాల కోసం బుక్‌మార్క్‌ చేస్తుంటాం. ఇకమీదట గూగుల్‌ తన బుక్‌మార్క్స్‌ సేవలను నిలిపివేయనుంది. సెప్టెంబరు 30 తర్వాత ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు సమాచారం. దీంతో గూగుల్‌ బుక్‌మార్క్స్‌ 16 ఏళ్ల సుదీర్ఘ సేవలకు తెరపడనుంది....

Published : 21 Jul 2021 23:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పీసీ లేదా మొబైల్‌లో బ్రౌజింగ్ చేసేప్పుడు మనకు నచ్చిన పేజ్‌ లేదా వెబ్‌సైట్‌ను భవిష్యత్తు అవసరాల కోసం బుక్‌మార్క్‌ చేస్తుంటాం. ఇకమీదట గూగుల్‌ తన బుక్‌మార్క్స్‌ సేవలను నిలిపివేయనుంది. సెప్టెంబరు 30 తర్వాత ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు సమాచారం. దీంతో గూగుల్‌ బుక్‌మార్క్స్‌ 16 ఏళ్ల సుదీర్ఘ సేవలకు తెరపడనుంది. ఈ మేరకు కొద్దిమంది యూజర్స్‌ స్క్రీన్‌లపై ‘‘సెప్టెంబరు 30 2021 తర్వాత గూగుల్ బుక్‌మార్క్స్‌ సేవలు అందుబాటులో ఉండవు’’ అనే మెసేజ్‌ కనిపిస్తోందట. అలానే యూజర్స్ ఎక్స్‌పోర్ట్ బుక్‌మార్క్స్‌ ఆప్షన్‌ ద్వారా తమ బుక్‌మార్క్స్‌ని మరో చోటుకి కాపీ చేసుకోవాలని సదరు మెసేజ్‌లో సూచిస్తున్నారు.

గూగుల్ బుక్‌మార్క్స్‌ వల్ల గూగుల్ మ్యాప్స్‌ యూజర్స్‌కి సమస్యలు వస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు గూగుల్‌ మ్యాప్స్‌లోని స్టార్డ్‌ లొకేషన్‌ ఫీచర్‌ గూగుల్ బుక్‌మార్క్స్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బుక్‌మార్క్స్‌ సేవలు నిలిచిపోనుండటంతో మ్యాప్స్‌లో తమ ఫేవరెట్ లొకేషన్స్ వివరాలు కూడా డిలీట్ అవుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై  స్పష్టత లేకపోవడంతో పలువురు యూజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలానే ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా టెక్‌ నిపుణులు మరో ఆప్షన్ సూచిస్తున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌లో గతంలో మీరు స్టార్డ్ చేసిన లొకేషన్లను తిరిగి ఓపెన్ చేయాలి. తర్వాత లొకేషన్‌పై క్లిక్ చేస్తే పక్కనే సేవ్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ లొకేషన్‌ మ్యాప్స్‌లో సేవ్‌ అవుతుంది. అలా మీకు నచ్చిన లొకేషన్‌ని గూగుల్ మ్యాప్స్‌లో స్టార్డ్‌కి బదులు సేవ్‌ చేసుకోవచ్చు. దానివల్ల బుక్‌మార్క్స్‌లో మీ డేటా డిలీట్ అయినప్పటికీ మ్యాప్స్‌లో మీ లొకేషన్‌ వివరాలు భద్రంగా ఉంటాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు