Updated : 16 May 2022 20:13 IST

Google Translate: ఇక సంస్కృతాన్ని అనువదించవచ్చు.. కొత్తగా 24 కొత్త భాషలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్థానిక భాష తెలియకపోయినా, ఏదైనా డాక్యుమెంట్ చదివేప్పుడు అందులో పదాలకు అర్థం తెలియకున్నా క్షణాల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్‌ సాయం తీసుకుంటాం. ఎన్నో ఏళ్లుగా గూగుల్ ట్రాన్స్‌లేట్‌ సేవలను యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇందులో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలు కాకుండా కొన్నింటిని మాత్రమే ట్రాన్స్‌లేట్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఇటీవల జరిగిన యూన్యువల్ డెవలపర్స్‌ సదస్సులో మరో 24 భాషలను ట్రాన్స్‌లేట్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీంతో మొత్తం గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 133 భాషలను తర్జుమా చేసుకోవచ్చు. గూగుల్ కొత్తగా యాడ్‌ చేసిన 24 భాషలను ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్‌ మంది ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఈ 24 భాషల జాబితాలో భారత్‌కు చెందిన ఎనిమిది భాషలు -  అస్సామీ, భోజ్‌పురి, డోగ్రీ, కొంకణి, మైథిలి, మణిపురి, మిజో, సంస్కృతం ఉన్నాయి.  సంస

మొత్తం భారతీయ భాషలు ఎన్ని?

అస్సామీ భాషను ఈశాన్య భారతంలో 25 మిలియన్ల మంది, భోజ్‌పురిని నేపాల్‌, ఫిజి దేశాలతోపాటు ఉత్తర భారతంలోని 50 మిలియన్ల మంది, డోగ్రీ భాషను ఉత్తర భారతంలోని మూడు మిలియన్ల జనాభా, కొంకణిని రెండు మిలియన్ల జనాభా, మైథిలి భాషను ఉత్తర భారతంలోని 34 మిలియన్ల జనాభా, మణిపురిని ఈశాన్య భారతంలోని రెండు మిలియన్ల జనాభా, మిజో భాషను ఈశాన్య భారతంలోని 8,30,000 మంది, సంస్కృతాన్ని భారత్‌లో 20 వేల మంది ఉపయోగిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. తాజా ఎనిమిది భాషలతో కలిపి మొత్తం 18 భారతీయ భాషలు గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.  

ట్రాన్స్‌లేషన్‌కు ఇవి కూడా..  

గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ సేవలు వెబ్‌, యాప్‌లతోపాటు గూగుల్ అసిస్టెంట్‌, లెన్స్‌ ద్వారా కూడా పొందవచ్చు. డెస్క్‌టాప్‌ యూజర్లు వెబ్‌ బ్రౌజర్‌ ఓపెన్ చేసి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ అని టైప్‌ చేసి కావాల్సిన భాషలోకి తర్జుమా చేసుకోవచ్చు. మొబైల్ యూజర్లు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోని ట్రాన్స్‌లేషన్‌ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫొటో లేదా డాక్యుమెంట్‌పై ఉన్న పదాలకు అర్థం తెలుసుకోవాలంటే గూగుల్‌ లెన్స్‌ ఓపెన్‌ చేసి దాన్ని ఫొటో తీస్తే ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌ చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీ కావాల్సిన భాషను ఎంచుకుంటే సరిపోతుంది. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని