Google Updates: క్రోమ్‌లో బగ్ ఫిక్స్.. మడత ఫోన్ల కోసం డ్రాగ్ అండ్ డ్రాప్!
గూగుల్ వర్క్‌స్పేస్‌లోని యాప్‌లను అప్డేట్ చేసింది. ఇందులో భాగంగా జీమెయిల్, మీట్, షీట్స్‌లో కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: వర్క్‌స్పేస్‌లోని యాప్స్‌ను గూగుల్ అప్డేట్ చేసింది. జీమెయిల్ సహా ఇతర యాప్‌లలో కొత్తగా మార్పులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని రీజియన్లలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. మరో రెండు వారాల్లో పూర్తిస్థాయిలో వర్క్‌స్పేస్ సబ్స్క్రైబర్లకు పరిచయం కానున్నట్లు తెలిపింది.
జీమెయిల్ (Gmail)
జీమెయిల్లో సెర్చ్ ఫీచర్‌ను గతంలోకంటే మరింత మెరుగుపరిచినట్లు గూగుల్ వెల్లడించింది. ఇకపై యూజర్ జీమెయిల్ సెర్చ్‌లో దేని గురించి వెతికినా కచ్చితత్వంతో ఫలితాలను చూపిస్తుందని గూగుల్ చెబుతోంది. అంతేకాకుండా యూజర్ అంతకముందు వెతికిన వాటికి సంబంధించిన సమాచారం కూడా చూపిస్తుందని తెలిపింది.
గూగుల్ షీట్స్ ( Google Sheets)
గూగుల్ షీట్స్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు పివోట్ టేబుల్స్‌ను అప్డేట్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. పివోట్ టేబుల్స్‌ను క్రియేట్ చేసి, ఎడిట్ చేసేటప్పుడు వాటి సైజును యూజర్ తనకు అనువుగా మార్చుకోవచ్చని తెలిపింది. చాలా కాలంగా యూజర్లు ఈ ఫీచర్ కోసం డిమాండ్ చేస్తున్నారట. అలానే, టేబుల్లోని ఏదైనా కాలమ్ పేరు పెద్దదిగా ఉంటే.. దానిని చదివేందుకు లేదా అందులో మార్పులు చేసేందుకు యూజర్లు పివోట్ టేబుల్ ఎడిటర్‌ను ఉపయోగించవచ్చు.
గూగుల్ మీట్ (Google Meet)
గతంలో గూగుల్ డాక్స్, స్లైడ్స్, షీట్స్ నుంచి మీట్ కాల్లో పాల్గొనేలా ఆయా యాప్‌లను అప్డేట్ చేసింది. తాజాగా అప్డేట్లో యూజర్లు డాక్స్, స్లైడ్స్, షీట్స్ నుంచి మీట్ చాట్ లేదా కాల్లో పాల్గొంటూ ఫైల్స్‌ను షేర్ చేయొచ్చు. దీంతో మీట్లో పాల్గొనేవారందరకి ఒకేసారి ఫైల్ షేర్ అవుతుంది. అంతేకాకుండా ఫైల్లోని సబ్జెక్ట్ గురించి అందరూ ఒకేసారి చర్చించుకోవడంతోపాటు, ప్రజెంటేషన్‌ను ఇవ్వొచ్చని గూగుల్ తెలిపింది.
క్రోమ్ అప్డేట్ (Google Chrome)
గతవారం క్రోమ్ బ్రౌజర్లో గుర్తించిన జీరో-డే సమస్యను సరిచేస్తూ గూగుల్ కొత్త అప్డేట్ను విడుదల చేసింది. CVE-2022-413 పేరుతో ఈ బగ్‌ను గూగుల్ థ్రెట్ అనాలసిస్ గ్రూప్ గుర్తించింది. తాజాగా ఈ సమస్యను పరిష్కరిస్తూ గూగుల్ క్రోమ్ 107.0.5304.121 (మ్యాక్/లైనెక్స్ డివైజ్‌లకు), 107.0.5304.121/.122 (విండోస్ కంప్యూటర్ల) కోసం విడుదల చేసింది. యూజర్లు తమ కంప్యూటర్లలో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అబౌట్ క్రోమ్ ఆప్షన్ ద్వారా అప్డేట్ చేయొచ్చు.
డ్రాగ్ అండ్ డ్రాప్ (Drag and Drop)
మడతఫోన్లు, ట్యాబ్లెట్స్ వంటి పెద్ద డిస్ప్లే ఉన్న డివైజ్‌ల కోసం గూగుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు స్ల్పిట్ స్క్రీన్ ఫీచర్ ద్వారా ఫైల్స్‌ను ఒక యాప్ నుంచి మరో యాప్‌లోకి (గూగుల్ యాప్స్ మాత్రమే) బదిలీ చేయొచ్చు. స్ల్పిట్ స్క్రీన్‌లో రెండు యాప్‌లు పక్కపక్కనే చూడొచ్చు. దీంతో యూజర్ సులువుగా ఒక యాప్ నుంచి మరో యాప్‌లోకి ఫైల్స్‌ను డ్రాగ్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల