Chrome Update: ‘క్రోమ్‌’ బ్రౌజర్‌లో కొత్త అప్‌డేట్‌.. ఆ బగ్‌కు చెక్‌ పడినట్లేనా?

గూగుల్‌ క్రోమ్‌ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. విండోస్‌, మ్యాక్‌ఓఎస్‌, లైనక్స్‌ వాడే యూజర్ల కోసం క్రోమ్‌ 99.0.4844.84వెర్షన్‌లో కొత్త అప్‌డెట్‌ తీసుకొచ్చింది.

Updated : 28 Mar 2022 00:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గూగుల్‌ క్రోమ్‌ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. విండోస్‌, మ్యాక్‌ఓఎస్‌, లైనక్స్‌ వాడే యూజర్ల కోసం క్రోమ్‌ 99.0.4844.84వెర్షన్‌లో కొత్త అప్‌డెట్‌ తీసుకొచ్చింది. జీరో-డే లక్ష్యంగా సైబర్‌ దాడులు జరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన వాటిని అరికట్టడానికి గూగుల్‌ క్రోమ్‌లో ఈ కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ అధికారికంగా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

క్రోమ్‌ బ్రౌజర్‌లో బగ్‌ నంబర్ సీవీఈ-2022-1096 ఉన్నట్లు గూగుల్‌ గుర్తించింది. దీన్ని నియంత్రించడానికి బ్రౌజర్‌లో కొత్త అప్‌డేట్‌ తీసుకువస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కొత్త అప్‌డేట్‌లు కొన్ని డెస్క్‌టాప్ యూజర్ల కోసం విడుదల చేసింది. త్వరలోనే అన్ని డివైజ్‌ల్లో అందుబాటులోకి  తేనుంది. అంతేకాకుండా క్రోమ్‌ కొత్త అప్‌డేట్‌ ఆటోమెటిక్‌గా ఇన్‌స్టాల్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. ఒకవేళ త్వరగా అప్‌డేట్‌ చేసుకోవాలంటే గూగుల్‌ క్రోమ్‌ మెనూలోని ‘హెల్ప్‌’ అనే అప్షన్‌ను క్లిక్‌ చేసి ‘అబౌట్‌ గూగుల్‌ క్రోమ్‌’ ద్వారా కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని సూచించింది.

కాగా.. ఈ ఏడాదిలోనే గూగుల్‌ బగ్‌ నంబర్‌ సీవీఈ-2022-0609 ఉన్నట్లు గుర్తించి దాన్ని పరిష్కరించింది. ఈ బగ్‌ను ఉపయోగించి ఉత్తర కొరియా హ్యాకర్లు పెద్ద ఎత్తున సైబర్‌ దాడులు జరిపారని వివరించింది. తాజాగా కనుగొన్న బగ్‌ సీవీఈ-2022-1096 రెండోది కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని