Google Ads: మనకు నచ్చని యాడ్స్‌పై ఇక మనదే పెత్తనం..!
గూగుల్ యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ ఐ/ఓ 2022 (Google I/O)లో కీలక ప్రకటన చేసింది. యాడ్స్‌ను నియంత్రించుకునేలా ‘మై యాడ్ సెంటర్’ అనే ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లో మనం ఏ వస్తువు గురించైనా సెర్చ్ చేస్తే చాలు మరుక్షణమే దానికి సంబంధించిన ప్రకటనలు (Ads) కుప్పలు తెప్పలుగా ప్రత్యక్షమవుతుంటాయి. ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ ఇతరత్రా ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తుంటాయి. అంతలా టెక్నాలజీ మనల్ని, మన అభిరుచుల్ని ఫాలో అవుతుందన్నమాట. అయితే, ఆన్లైన్ యాడ్స్‌ను నియంత్రించటానికి తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అదేంటో ఓసారి చూద్దాం..
గూగుల్ యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ ఐ/ఓ 2022 (Google I/O)లో కీలక ప్రకటన చేసింది. యాడ్స్‌ను నియంత్రించుకునేలా ‘మై యాడ్ సెంటర్’ అనే ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్లు చూడాలనుకున్న బ్రాండ్ యాడ్స్‌ను తామే సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఏడాది చివరి నాటికి యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ వెల్లడించింది.
ఎలా పనిచేస్తుంది?
గూగుల్ ‘మై యాడ్ సెంటర్’లో మొత్తం యాడ్ నెట్వర్క్ ఏమీ ఉండదు. యూజర్లు గతంలో ఎక్కువగా వెతికిన బ్రాండ్ల పేర్లను మాత్రమే ఇందులో చూపిస్తుంది. ఇవి కూడా కేటగిరిల వారీగా ఉంటాయి. వీటిలో యూజర్లకు ఇష్టమైన కేటగిరిని సెలెక్ట్ చేసుకొని యాడ్స్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ‘పర్సనలైజ్డ్ యాడ్స్’ను టర్న్ ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
మై యాడ్ సెంటర్లో ఇటీవల మనం చూసిన యాడ్స్‌ను చూడటానికి ‘హోమ్ ట్యాబ్’లో మోస్ట్ రీసెంట్ ఆప్షన్ ఉంటుంది. ప్రైవసీలో మన వ్యక్తిగత సమాచారాన్ని యాడ్/ఎడిట్ చేసుకోవచ్చు. మెనూలో బ్రాండ్, టాపిక్, సెన్సిటీవ్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. టాపిక్ ట్యాబ్‌లో మనకు కావాల్సిన, ఆసక్తి ఉన్న వాటి సమాచారాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాండ్‌లో మనకు ఇష్టమైన బ్రాండ్ల పేర్లను ఎంచుకోవచ్చు. యాడ్స్‌ను కంట్రోల్ చేయడంతోపాటు ఫీడ్‌బ్యాక్ ఇవ్వటానికి లైక్, బ్లాక్, రిపోర్ట్ వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇదిలా ఉండగా.. ‘మై యాడ్ సెంటర్’ ఫీచర్ వల్ల చాలా బ్రాండ్లకు నష్టం వాటిల్లే అవకాశమూ లేకపోలేదు. అయితే, దీనికి సంబంధించి సరైన స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?