హ్యాకింగ్ వార్నింగ్‌కే హ్యాకింగ్ సమస్య!

ట్విటర్ కొద్ది రోజుల క్రితం యూజర్‌ భద్రత కోసం కొత్త వార్నింగ్ లేబుల్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ట్విటర్‌లో పోస్ట్‌ చేసే యూఆర్‌ఎల్‌ లింక్‌లోని సమాచారం అనుమానాస్పదంగా ఉంటే సదరు ట్వీట్‌కు... 

Published : 25 Feb 2021 22:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కొద్ది రోజుల క్రితం యూజర్‌ భద్రత కోసం కొత్త వార్నింగ్ లేబుల్‌ను ట్విటర్‌ తీసుకొచ్చింది. దీని సాయంతో ట్విటర్‌లో పోస్ట్‌ చేసే యూఆర్‌ఎల్‌ లింక్‌లోని సమాచారం అనుమానాస్పదంగా ఉంటే సదరు ట్వీట్‌కు ‘ఇందులోని సమాచారం హ్యాకింగ్‌కు ద్వారా సేకరించింది’ అని ఆంగ్లంలో వార్నింగ్ లేబుల్ ఇస్తుంది. అయితే కొంత మంది యూజర్స్‌ ఈ వార్నింగ్ లేబుల్‌లో లోపాన్ని గుర్తించారు. దాని కారణంగా మనం పోస్ట్ చేసే యూఆర్‌ఎల్‌ని సులభంగా హ్యాక్ చేసి ప్రతి ట్వీట్‌కు ఈ వార్నింగ్ లేబుల్ వచ్చేలా చెయ్యొచ్చని తెలిపారు. ట్విటర్‌లోని కార్డ్‌-బేస్డ్ సిస్టం లోపం కారణంగా ఇది సాధ్యపడుతుందని వెల్లడించారు.

వెబ్‌, ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యాప్‌ వెర్షన్లకు ఈ ట్రిక్ పనిచేస్తుందని తెలిపారు. ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ లేబుల్ ఉన్న ట్వీట్లను లైక్ చేయాలని ప్రయత్నిస్తే క్రాష్‌ అవుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ లోపం కారణంగా కొన్ని ప్రముఖ వార్తా సంస్థలకు చెందిన ట్వీట్‌లకు కూడా హ్యాకింగ్ వార్నింగ్ లేబుల్ వచ్చింది. దీంతో సదరు సంస్థలు ట్విటర్‌పై అసహనం వ్యక్తం చేశాయి. దీంతో ట్విటర్‌ ఈ లేబుల్‌ను ఉపసంహరించుకుని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపింది. గతంలో కొవిడ్‌-19కు సంబంధించి నకిలీ వార్తల వ్యాపించకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వివాదాస్పద ట్వీట్లకు ఇదే తరహా వార్నింగ్ లేబుల్స్‌ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా హ్యాకింగ్ వార్నింగ్ లేబుల్‌కే హ్యాకింగ్ సమస్య రావడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని