Haier: ఆటో-క్లీనింగ్‌ టెక్నాలజీతో హైయర్‌ రోబోట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌.. ధరెంతంటే?

రోబోట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ (డ్రై & వెట్)ను భారత్‌ మార్కెట్‌లో హైయర్‌ కంపెనీ విడుదల చేసింది. దీని ధరను.. 

Published : 31 May 2022 02:02 IST

దిల్లీ: ఆటో-క్లీనింగ్‌ టెక్నాలజీతో పనిచేసే తన టు ఇన్‌ వన్‌ రోబోట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ (డ్రై & వెట్)ను భారత్‌ మార్కెట్‌లో హైయర్‌ కంపెనీ విడుదల చేసింది. వైఫై 2.4 హెర్జ్‌, గూగుల్‌ హోమ్‌ అసిస్టెంట్‌ను ఇందులో అమర్చారు. తద్వారా హైయర్‌ స్మార్ట్‌ యాప్‌, వాయిస్‌ రిమోట్‌ సాయంతో దీనిని ఈజీగా కంట్రోల్‌ చేయవచ్చు. అన్ని రకాల ఫ్లోర్‌లను ఇది శుభ్రం చేయగలదని కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ క్లీనర్‌ వెళ్లే మార్గాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని సూచించింది.

సెల్ఫ్ ఛార్జింగ్ ఫీచర్‌తో..

వాక్యూమ్‌ క్లీనర్‌లో 600ml డస్ట్‌ బిన్‌‌, 350ml ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ ఉంది. ఇతర రోబోట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ల మాదిరిగానే, ఇదీ ఆటోమేటిక్ సెల్ఫ్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. అంటే బ్యాటరీ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ పాయింట్‌కు తిరిగి వెళ్తుంది. ఆన్‌ చేసిన 10 నిమిషాల తర్వాత దీన్ని వాడకుండా ఉన్నట్లయితే స్లీప్ మోడ్‌లోకి వెళ్తుంది. ఇందులోని క్లిఫ్‌ సెన్సార్‌ల ఆధారంగా ఎత్తుపల్లాలను ముందే గమనించి పడిపోకుండా వాక్యూమ్‌ క్లీనర్‌ తన్నుతాను రక్షించుకోగలదని కంపెనీ పేర్కొంది. మరీ ముఖ్యంగా దీన్ని 2600mAh బ్యాటరీ బ్యాకప్‌తో తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కాగా, అమెజాన్‌, హైయర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.14,999గా నిర్ణయించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని