Upcoming Smartphones: ఏప్రిల్‌లో కొత్త ఫోన్ల సందడి.. ఏమేం వస్తున్నాయ్‌?

ఎప్పటిలానే ఏప్రిల్‌ నెలలో కూడా బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ప్రీమియం శ్రేణిలో కొత్త మోడల్స్‌ను మొబైల్ తయారీ కంపెనీలు విడుదల చేయనున్నాయి. మరి ఆ కొత్త ఫోన్ల జాబితాపై ఓ లుక్కేద్దామా? 

Updated : 30 Mar 2022 14:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్నాలజీ మారుతున్నకొద్దీ మొబైల్ కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి పరిచయం చేస్తుంటాయి. ఎప్పటిలానే ఏప్రిల్‌ నెలలో కూడా బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ప్రీమియం శ్రేణిలో కొత్త మోడల్స్‌ను వివిధ మొబైల్ తయారీ కంపెనీలు విడుదల చేయనున్నాయి. మరి ఆ కొత్త ఫోన్ల జాబితాపై ఓ లుక్కేద్దామా? 


శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌53 5జీ (Samsung Galaxy M53 5G)

శాంసంగ్ కంపెనీ మిడ్‌ రేంజ్‌ శ్రేణిలో గతంలో విడుదలైన ఎమ్‌52 5జీ మోడల్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. వెనుక 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, రెండు 2 ఎంపీ, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 8జీబీ ర్యామ్‌/ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో తీసుకొస్తున్నారట. దీని ధర ₹20 వేల నుంచి ₹25 వేల మధ్య ఉంటుందని అంచనా.


శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌23 (Samsung Galaxy M23)

మీడియాటెక్‌ హీలియో జీ88 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 12 వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో ఈ ఫోన్‌ చేస్తుందని సమాచారం. 6.6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారని తెలుస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీలతోపాటు ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చినట్లు సమాచారం. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీని ధర ₹15 వేల నుంచి ₹20 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.


వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 సీఈ లైట్‌ (OnePlus Nord 2 CE Lite)  

స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌ ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు, ముందు బాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండబోతోంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ధర ₹15 వేల నుంచి ₹18 వేల మధ్య ఉండొచ్చని సమాచారం.


వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 (OnePlus Nord 3)

ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌ ఈ మోడల్‌ను పరిచయం చేయనుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, వెనుక 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 150 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఈ ఫోన్‌ ధర ₹35 వేల పైనే ఉంటుందని సమాచారం.


వన్‌ప్లస్‌ 10 ఆర్‌ (OnePlus 10R)

వన్‌ప్లస్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ శ్రేణిలో వస్తున్న మరో కొత్త మోడల్‌ ఇది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఇస్తున్నారట. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక 64 ఎంపీ, 16 ఎంపీ, 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలుంటాయని సమాచారం. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుందట. దీని ధర ₹35 వేల నుంచి ₹40 వేల మధ్య ఉంటుందని అంచనా.


పోకో ఎఫ్‌ 4 జీటీ (Poco F4 GT)

గేమింగ్ ప్రియుల కోసం పోకో కంపెనీ మిడ్‌ రేంజ్‌ ధరలో ఎఫ్‌ 4 జీటీ మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1200 ఎమ్‌టీ 6893 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. 1120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారని తెలుస్తోంది. 4,560 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుందని సమాచారం. ఈ ఫోన్ ధర ₹25 వేల నుంచి ₹30 వేల మధ్య ఉండొచ్చని అంచనా. దీంతోపాటు పోకో ఎఫ్‌4 లైట్ (Poco F4 Lite) పేరుతో ₹20 వేలలోపు ధరలో మరో కొత్త మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు టెక్‌ వర్గాల సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.


 

మైక్రోమాక్స్‌ ఇన్‌ 2సీ (Micromax In 2C)

ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ యూనీసాక్‌ టీ610 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.52 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. 13 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలుంటాయట. ముందు 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌ ₹8 వేల నుంచి ₹9 వేలకు లభించవచ్చని తెలుస్తోంది.


షావోమి 12 ప్రో (Xiaomi 12 Pro)

ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ వన్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.28 అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుక 50 ఎంపీ, 5 ఎంపీ, 13 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 120 హైపర్‌ ఛార్జ్‌, 50 వాట్ వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్, 10 వాట్ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ/ 256 జీబీ, 12 జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. 


వివో టీ1 ప్రో 5జీ (Vivo T1 Pro 5G)

వివో కంపెనీ నుంచి మిడ్‌ రేంజ్‌ శ్రేణిలో రాబోతున్న ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారని తెలుస్తోంది. వెనుక 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతోపాటు ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. 6 జీబీ ర్యామ్‌ / 128 జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ధర ₹15 వేల నుంచి ₹20 వేల మధ్య ఉంటుందని సమాచారం. 


రియల్‌మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro)

ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ వన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల 2k సూపర్‌ రియాల్టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. రెండు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాలతో పాటు, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలున్నాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 65 వాట్ సూపర్‌ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ/256 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర ₹40 వేల నుంచి ₹50 వేల మధ్య ఉంటుందని సమాచారం.


మోటో ఎస్‌30 (Moto S30)

రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఒక మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, మరోదానిలో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారని తెలుస్తోంది. 144 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. వెనుక 108 ఎంపీ, 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాతోపాటు, ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో పవర్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర ₹20 వేల నుంచి ₹25 వేల మధ్య ఉంటుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని