iPhone 14: ఐఫోన్ 14.. మినీకి బై..బై.. పిక్సెల్‌ బిన్నింగ్ టెక్‌తో కెమెరా!

2022లో యాపిల్ ఐఫోన్ 14ను విడుదల చేయనుంది. అయితే వీటిలో మినీ మోడల్‌ ఇక మీదట ఉండబోదని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఐఫోన్‌ 14లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయో ఒక్కసారి చూద్దాం. 

Updated : 12 Aug 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకవైపు కరోనా, మరోవైపు లాక్‌డౌన్.. ఈ పరిస్థితుల్లో అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? లేదా? అన్న ఉత్కంఠకు తెర దించుతూ ఐఫోన్‌ 13 ఎప్పటిలానే ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో మార్కెట్లోకి విడుదలైంది. తర్వాతేంటి.. ఇంకేముంది 2022 సెప్టెంబర్‌కి ఐఫోన్ 14 విడుదల కోసం ఎదరుచూడటమే అనే సమాధానం చాలా మంది టెక్‌ ప్రియుల నుంచి వినిపిస్తోంది. మరి ఐఫోన్‌ 14 ఎలా ఉంటుంది? అందులో ఏమేం ఫీచర్స్ ఇస్తారు.. వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎప్పటిలానే ఐఫోన్ 14 కూడా నాలుగు వేరియంట్లలో తీసుకొస్తున్నారట. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్‌‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌. అయితే ఈసారి మినీ వేరియంట్ ఉండకపోవచ్చని టెక్ వర్గాల భావిస్తున్నాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్‌లో మినీ వేరింయట్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో యూజర్స్ వీటిపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని యాపిల్ భావిస్తోందట. ఇక ఐఫోన్‌ 14, 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, మాక్స్‌, ప్రో మాక్స్‌ మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. ఈ ఫోన్లలో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నట్లు సమాచారం.

అలానే ప్రో మోడల్స్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయట. వాటిలో 48 ఎంపీ వైడ్‌లెన్స్‌తోపాటు, 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, టెలి లెన్స్ అమర్చినట్లు తెలుస్తోంది. ఇవి 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయట. అలానే 48 ఎంపీ కెమెరాలో పిక్సెల్ బిన్నింగ్‌ కెమెరా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇది తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా అత్యుత్తమ క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 8 జీబీ ర్యామ్‌ , ఐఫోన్‌ 14 మోడల్స్‌లో 6జీబీ ర్యామ్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది. ఐఫోన్ 13 తరహాలోనే వీటిలో కూడా శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఫీచర్‌ ఉంటుందట. ఈ ఫోన్లలో యాపిల్ 5ఎన్‌ఎమ్ ఏ16 బయోనిక్ చిప్ ఉపయోగిస్తున్నారని సమాచారం.

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని