March Smartphones: మార్చిలో మార్కెట్లోకి రాబోయే మొబైల్స్ ఇవే!
కొత్త మోడల్స్‌తో ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు... సరికొత్త ఫోన్స్ కొనడానికి వినియోగదారులు ఎప్పుడూ రెడీయే.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త మోడల్స్‌తో ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు... సరికొత్త ఫోన్స్ కొనడానికి వినియోగదారులు ఎప్పుడూ రెడీయే. మార్చిలో అలా కొన్ని స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వరుసకట్టనున్నాయి. మిడ్ రేంజ్ నుంచి హై ఎండ్ ధరల్లో... సరికొత్త టెక్నాలజీ, అద్భుతమైన ఫీచర్లతో ఈ మొబైల్స్ రాబోతున్నాయి. మరి ఆ మోడల్స్ జాబితాపై ఓ లుక్కేద్దామా!
ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE3)
మార్చి రెండు లేదా మూడో వారంలో ఐఫోన్ ఎస్ఈ3 విడుదలకానుందని సమాచారం. ఇందులో ఏ 15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4.7 అంగుళాల హెచ్డీ రెటీనా డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఈ ఫోన్లో క్వాల్‌కోమ్ ఎక్స్60 5జీ మోడెమ్‌ను ఉపయోగించారు. ఐఓఎస్ 15తో పని చేస్తుంది. టచ్ ఐడీ, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఎస్ఈ 3లో రెండు కెమెరాలుంటాయి. వెనుక 12ఎంపీ, ముందు 7ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. మొబైల్ ధర రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉంటుందని సమాచారం.
శాంసంగ్ ఎమ్ 33 5జీ (Samsung M33 5G)
మార్చి నాలుగో వారంలో శాంసంగ్ ఎమ్ 33 5జీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 6.46 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఎగ్జినోస్ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ/8 జీబీ ర్యామ్ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ధర విషయాలు తెలియాల్సి ఉంది.
వివో టీ1 ప్రో (Vivo T1 Pro)
టీ1 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను వివో భారత మార్కెట్లోకి ఇప్పటికే విడుదల చేసింది. మార్చిలో టీ1 ప్రో సిరీస్‌లో 4జీ, 5జీ మోడల్స్‌ను తీసుకురానుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు మూడు, ముందు రెండు కెమెరాలుంటాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 8 జీబీ/ 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందట.
ఒప్పో ఎఫ్ 21 సిరీస్ (Oppo F 21 Series)
ఎఫ్ సిరీస్‌లో రెండు మోడల్స్‌ను మార్చి రెండో వారంలో ఒప్పో విడుదల చేయనుంది. ఎఫ్ 21 పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 720జీ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.43 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.20 వేలు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ మొబైల్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G)
వన్‌ప్లస్ నుంచి మరో 5జీ మొబైల్ విడుదల కానుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల 2k డిస్ప్లేతో వన్‌ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్ తీసుకొస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 5జీ ప్రాసెసర్. 50 ఎంపీ హేజల్బ్లేడ్ కెమెరాలున్నాయి. మార్చి మూడో వారంలో ఈ మొబైల్ విడుదలవుతున్నట్లు సమాచారం. దీంతోపాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ సిరీస్‌లో మరో కొత్త మోడల్ కూడా వస్తుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ (OnePlus Nord CE 2 Lite) పేరుతో ఈ మొబైల్ తీసుకొస్తారట. ఇందులో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. మార్చి మూడో వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకానుంది.
రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ (Redmi Note 11 Pro Series)
రెడ్మీ మొబైల్ శ్రేణిలో పాపులర్ సిరీస్ అయిన నోట్ సిరీస్‌లో కొత్త మొబైల్ తీసుకొస్తున్నారు. మార్చి రెండు లేదా మూడో వారంలో రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మోడల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
పోకో ఎక్స్4 సిరీస్ (Poco X4 Series)
పోకో ఎక్స్ సిరీస్‌లో రెండు మోడల్స్ తీసుకొస్తోంది. వీటిలో ఒకటి 5జీ ఫోన్. 120 హెర్జ్ 6.67 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మార్చి చివరి వారంలో ఈ మొబైల్ విడుదల కానుంది. పోకో జీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. ఎఫ్4 జీటీ (Poco F4 GT) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మైక్రోమాక్స్ ఇన్2 (Micromax In2)
ఇన్ సిరీస్‌లో మైక్రోమాక్స్ మరో మొబైల్‌ను లాంచ్ చేయనుంది. ఇన్ 2 పేరుతో తీసుకొస్తున్న ఈ మొబైల్లో... 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మార్చి రెండు లేదా మూడో వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకానుంది.
షావోమి 12 సిరీస్ (Xiaomi 12 Series)
షావోమి 12 సిరీస్ మొబైల్స్ కూడా ఈ నెలలోనే రానున్నాయి. ఈ మొబైల్స్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.28 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 5జీకి సపోర్టు చేస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు.
రియల్మీ జీటీ 2 (Realme GT 2)
జీటీ సిరీస్‌లో రియల్మీ రెండు మోడల్స్‌ను తీసుకొస్తుంది. రియల్మీ జీటీ 2, రియల్మీ జీటీ 2 ప్రో పేరుతో మొబైల్స్ విడుదలచేయనుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల 2K డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు అదనంగా రెండు కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. వీటితోపాటు రియల్మీ 9 (Realme 9) మోడల్‌ను 4జీ, 5జీ వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్, 18 వాట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇస్తున్నారట. మార్చి చివరి వారంలో ఈ మొబైల్ విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత