ఐఫోన్‌ 12 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవేనా!

ఇటీవల యాపిల్‌ హై- స్పీడ్ పేరుతో అక్టోబరు 13 తేదీన కొత్త ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈవెంట్‌లో ఏం లాంఛ్ చేస్తారనే దానిపై టెక్‌ అభిమానుల్లో చర్చ మొదలయింది. ఈ కార్యక్రమంలో యాపిల్‌ ఐఫోన్‌ 12...

Updated : 12 Aug 2022 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఐఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేయడానికి హై- స్పీడ్ పేరుతో యాపిల్‌ ఈ రోజు ఓ ఈవెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి నాలుగు ఐఫోన్స్‌ వస్తాయని చాలా రోజుల క్రితమే సమాచారం వచ్చింది. మరి ఆ ఐఫోన్‌ 12 మొబైల్స్‌ ఫీచర్స్‌ ఎలా ఉంటాయి, ధర ఎంత ఉండొచ్చు అంటూ టెక్‌ వరల్డ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.

ఎన్ని మోడల్స్‌ అంటే..

ఐఫోన్‌ 12 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను తీసుకొస్తున్నారని ముందే చదువుకున్నాం. అవి ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌. వీటిలో 5జీ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది. నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి 4జీ/5జీకి మారేందుకు వీలుగా స్మార్ట్‌ డేటా మోడ్ ఇస్తున్నారట. అమెరికన్‌ మోడల్స్‌‌లో ఎంఎంవేవ్‌ 5జీ నెట్‌వర్క్‌ టెక్నాలజీని, ఇతర దేశాల మోడల్స్‌లో సబ్‌-6జీహెచ్‌జడ్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీని ఉపయోగించారట. ఐఫోన్ 12 మోడల్స్‌ 15 వాట్ మాగ్నటిక్ ‌సేఫ్ పవర్‌ కనెక్టర్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తాయని సమాచారం. ప్రస్తుతం మాగ్నటిక్‌ సేఫ్‌ టెక్నాలజీ మ్యాక్‌ కంప్యూటర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 

డిస్‌ప్లే.. ధరెంతంటే..

ఐఫోన్‌ 12 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఐఫోన్‌ 12 ప్రోలో 6.1 అంగుళాలు, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. కెమెరాల విషయానికొస్తే ఐఫోన్ 12 మినీ, ఐఫోన్‌ 12లో డ్యూయల్‌ కెమెరా... ఐఫోన్‌ 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 12 మినీ ధర 699 డాలర్లు, ఐఫోన్‌ 12 ధర 799 డాలర్లు ఉండొచ్చు. బ్లాక్‌, వైట్, బ్లూ, గ్రీన్ రంగుల్లో తీసుకొస్తున్నారట. ఐఫోన్‌ 12 ప్రో ధర 999 డాలర్లు, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ ధర 1,099 డాలర్లుగా ఉంటుందట. అలానే హై- స్పీడ్ ఈవెంట్‌లో హోం పాడ్ మినీ కూడా విడుదల చేయనున్నారట. దీని ధర 99 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. మరి వీటి ధర మన దేశంలో ఎంత ఉంటుందనే విషయంలో సమాచారం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని