ఈ ఏటి మేటి స్మార్ట్‌వాచ్‌లివే..!
కొన్నేళ్ల క్రితం స్మార్ట్‌వాచ్ అంటే..దానితో పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయం చాలా మంది యూజర్స్‌లో ఉండేది. కానీ గతేడాది కాలంలో మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొత్త ఫీచర్స్‌తో అందుబాటు ధరలో ఉండటంతో వీటి వినియోగం పెరిగింది...
ఇంటర్నెట్ డెస్క్: కొన్నేళ్ల క్రితం స్మార్ట్‌వాచ్ అంటే.. దాంతో పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కానీ గతేడాది కాలంలో మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొత్త ఫీచర్స్‌తో పాటు అందుబాటు ధరలో ఉండటంతో వీటి వినియోగం ఎక్కువైంది. అలానే కొవిడ్-19 ప్రభావంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపట్ల జాగ్రత్త పెరిగింది. మారిన జీవనశైలికి అనుగుణంగా ఏం తింటున్నాం?.. ఎంత తింటున్నాం?.. ఎంత బరువు పెరిగాం?.. ఎంతసేపు వ్యాయామం చేశాం? ఇలా ప్రతిదీ లెక్కలు వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శరీర పనితీరు గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తూ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచుతుండటంతో స్మార్ట్‌వాచ్ వినియోగానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరి 2020లో మార్కెట్లో సందడి చేసిన టాప్ స్మార్ట్‌వాచ్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా...?
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3
గుండ్రటి డయల్‌తో చూడటానికి సాధారణ వాచ్ తరహాలో ఉండే గెలాక్సీ వాచ్ 3లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. 1.4-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డీఎక్స్ ప్రొటెక్షన్ ఉంది. ఎగ్జినోస్ 9110 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. శాంసంగ్ వన్ యూఐ వాచ్ ఎడిషన్ ఓఎస్‌తో పనిచేస్తుంది. హార్ట్‌రేట్ సెన్సర్‌తో పాటు, శరీరంలో బ్లడ్ ఆక్సిజన్ శాతాన్ని అంచనా వేసేందుకు సెన్సర్స్, యాక్సిలరో మీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఒత్తిడిని గుర్తించే సెన్సర్స్, ఫిట్నెస్ ట్రాకింగ్, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెజర్ మానిటర్‌తో పాటు ఈసీజీ చెక్ చేసుకోవచ్చు. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 38,990. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ రీడింగ్, మెసేజ్ రిప్లై, వాచ్ ఫేస్ కస్టమైజేషన్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 6
యాపిల్ వాచ్ సిరీస్ 6లో 1.78 అంగుళాల ఓఎల్ఈడీ రెటీనా డిస్ప్లే ఇస్తున్నారు. యాపిల్ ఎస్5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వాచ్ ఓఎస్ 7తో పనిచేస్తుంది. 16 జీబీ అంతర్గత మెమొరీ ఇస్తున్నారు. ఈ వాచ్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీంతో ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ శాతం వంటివి చెక్ చేసుకోవచ్చు. ఇందులో యాక్సిలరో మీటర్‌తో పాటు ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సర్, స్లీప్ ట్రాకర్ ఉన్నాయి. ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను కూడా సూచిస్తుంది. 50 మీటర్ల లోపల నీటిలో పడినా పనిచేస్తుంది. అల్యూమినియం, స్లెయిన్‌లెస్ స్టీల్, టైటానియమ్, సెరామిక్ డయల్స్ వేరియంట్లలో ఈ వాచ్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 49,900.
షావోమి ఎంఐ వాచ్ రివాల్వ్
షావోమి నుంచి వచ్చిన తొలి స్మార్ట్‌వాచ్. ఇందులో పీపీజీ హార్ట్‌రేట్ సెన్సర్, త్రీ-యాక్సిస్ యాక్సెలరేషన్ సెన్సర్, గైరోస్కోప్, జియోమాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్‌లో 1.3-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. షావోమి వేర్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ 5 ఏటీఎం వాటర్ ప్రూఫ్ డిజైన్‌తో తయారైంది. ఫస్ట్‌బీట్ అల్గారిథమ్ సహాయంతో సైకలాజికల్ డేటాను కూడా అందిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, హార్ట్‌రేట్ మానిటరింగ్, బాడీ ఎనర్జీ మానిటరింగ్, 10 స్పోర్ట్స్ మోడ్స్, 110 వాచ్ ఫేసెస్ ఉన్నాయి. 420 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వారాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 10,999.
ఒప్పో స్మార్ట్‌వాచ్
ఒప్పో స్మార్ట్‌వాచ్ రెండు డిస్ప్లే వేరియంట్లలో లభిస్తుంది. 1.6-అంగుళాలు, 1.9-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే. స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దానితో పాటు బ్యాటరీ సేవింగ్ మోడ్ కోసం యాంబిక్యూ మైక్రో అపోలో 3 వైర్లెస్ ప్రాసెసర్‌ను కూడా ఉపయోగించారు. వేర్ ఓఎస్ 5తో ఈ వాచ్ పనిచేస్తుంది. 5ఏటీఏం వాటర్ ప్రూఫ్ డిజైన్‌తో తయారైంది. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇస్తున్నారు. 430 ఎంఏహెచ్, 300 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్లలో లభిస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే పవర్ సేవర్ మోడ్‌లో 21 రోజులు, 14 రోజులు పనిచేస్తాయి. ఈ వాచ్‌లో గైరోస్కోప్ సెన్సర్, జియో మాగ్నటిక్ సెన్సర్, హార్ట్‌బీట్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ట్రై-యాక్సియల్ యాక్సిలరేషన్ సెన్సర్, స్లీప్ మానిటర్, ఫిట్నెస్ మానిటర్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గైడ్ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 14,990.
అమేజ్‌ఫిట్ జీటీఎస్
యాపిల్ తరహా డిజైన్ ఆకృతితో మెటల్ బాడీతో అమేజ్‌ఫిట్ జీటీఎస్ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇతర స్మార్ట్‌వాచ్‌లకు ధీటుగా ఇందులో కూడా వాటర్ రెసిస్టెంట్, హార్ట్‌రేట్ సెన్సర్, 12 రకాల ఎక్సర్సైజ్ మోడ్లు, 6-యాక్సిస్ యాక్సిలరేషన్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, స్లీప్ మానిటర్ ఉన్నాయి. ఈ వాచ్‌లో 1.65-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. 220 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 9,999.
హువావే వాచ్ జీటీ 2ఈ
ఈ వాచ్‌లో 1.39 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. కిరిన్ ఏ1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. యాక్సిలరోమీటర్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్, జియోమాగ్నటిక్ సెన్సర్, ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఎక్సర్సైజ్ మానిటర్ ఉన్నాయి. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నారు. ఈ వాచ్ 5 ఏటిఎం వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్‌తో తయారైంది. నోటిఫికేషన్స్ చూడొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వారాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. వాచ్ ప్రారంభ ధర రూ. 11,990.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!