Published : 09 Nov 2021 15:03 IST

5G Smartphones: ₹ 25 వేలలోపు ధరలో 5జీ ఫోన్లు..ఇదిగో జాబితా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ మొబైల్ యూజర్స్‌కి 5జీ సేవలు అందని ద్రాక్షే అని చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్ల క్రితం 5జీ పరీక్షలు ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటికీ ఈ నెట్‌వర్క్‌ యూజర్స్‌కి అందుబాటులోకి రాలేదు. కానీ మొబైల్ తయారీ కంపెనీలు మాత్రం 5జీ మోడల్స్‌ భారత మార్కెట్లోకి విడుదలచేస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన 5జీ మోడల్స్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో రూ. 25 వేలలోపు ధరలో అందుబాటులో ఉన్న ఫోన్ల గురించి తెలుసుకుందాం.  


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 (Samsung Galaxy F42)

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ యూఐ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉపయోగించారు. ఎఫ్42లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ కెమెరాతోపాటు 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ 15 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంగ్‌ ధర రూ. 20,999 కాగా, 8 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. 


మోటోరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ (Motorola edge20 Fusion)

మోటోరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీఆర్‌10+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్‌ టర్బోపవర్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లో 12 గంటలకు సరిపడా బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని మోటోరోలా తెలిపింది. ఇందులో నాలుగు కెమెరాలున్నాయి. వెనుక 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 32 ఎంపీ హెచ్‌డీఆర్‌ కెమెరా ఇస్తున్నారు. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర రూ. 21,499. 8 జీబీ/128 జీబీ ధర రూ. 22,999.     


వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ (OnePlus Nord CE)

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో 6.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాగింల్, 2 ఎంపీ మోనోలెన్స్‌ కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం ముందు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 8 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ. 24,999. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ వేరియంట్ ధర రూ. 27,999.  


శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌52 5జీ (Samsung Galaxy M52 5G)

ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. ముందు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 5 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌52 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర రూ. 24,999. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 26,999. 


ఐక్యూ జెడ్‌5 (iQoo Z5)

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. అలానే గేమింగ్‌ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 240 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో 4డీ గేమ్‌ వైబ్రేషన్‌తో లీనియర్ మోటార్‌ ఇస్తున్నారు. 3డీ సౌండ్ అనుభూతి కోసం డ్యూయల్ స్పీకర్స్ అమర్చారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఐక్యూ జెడ్‌5లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44వాట్‌ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,990. 12 జీబీ/128 జీబీ ధర రూ. 26,990. 


షావోమి ఎమ్‌ఐ 10ఐ (Xiaomi Mi 10i)

షావోమి మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్‌/64 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర  రూ. 20,999, 6 జీబీ/128 జీబీ ధర రూ. 21,999, 8 జీబీ/128 జీబీ ధర రూ. 23,999. స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు. ఈ ఫోన్‌లో ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ మైక్రో డెప్త్‌ కెమెరాలున్నాయి. ముందు 16 ఎంపీ కెమెరా ఉంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 750జీ 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.    

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని