Published : 28/08/2021 10:54 IST

Browsing Apps: మొబైల్‌ బ్రౌజింగా..టాప్‌ 5 యాప్స్‌ ఇవిగో!

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్ లేదా పీసీ డివైజ్ ఏదైనా..మన కావాల్సిన సమాచారాన్ని బ్రౌజర్‌లో వెతికేస్తాం. స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా, ఫైనాన్స్, గేమింగ్ యాప్‌ల తర్వాత మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించేది బ్రౌజర్ యాప్‌లకే. వీటిలో కూడా ఒక్కొక్కరిది వేర్వేరు ఎంపిక. బుక్‌మార్క్స్‌ , డెస్క్‌టాప్‌ మోడ్‌ వంటి ఫీచర్స్ సులభంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉన్న బ్రౌజింగ్‌ యాప్‌లను ఉపయోగించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరేమో ప్రైవసీకి ప్రాధాన్యం ఉన్న యాప్‌లను ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ ఉన్న టాప్‌ 5 బ్రౌజర్లు ఏంటో చూద్దాం.


గూగుల్ క్రోమ్‌ (Google Chrome)

బ్రౌజర్ అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చే పేరు గూగుల్ క్రోమ్‌. ప్రపంచవ్యాప్తంగా సగం మందికిపైగా యూజర్లు క్రోమ్‌ను తమ డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌లో ఉపయోగిస్తున్నారు. అలానే క్రోమ్ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కోసం క్రోమియం ప్రాజెక్ట్‌లో భాగంగా బ్లింక్ అనే బ్రౌజర్ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఇప్పటికే చాలా మొబైల్ కంపెనీలు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్ క్రోమ్‌ను ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌గా ఇస్తున్నారు. ఈ బ్రౌజర్‌లోని సింక్‌ ఫీచర్ ఎలాంటి హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌కైనా సపోర్ట్ చేస్తుంది. కొత్త ఆండ్రాయిడ్ ఫీచర్స్‌ ఏవైనా మిగతా బ్రౌజర్స్ కంటే ముందుగా గూగుల్ క్రోమ్‌లోకే వస్తాయి. 


డక్‌ డక్‌ గో (Duck Duck Go)

వెబ్‌ బ్రౌజింగ్‌లో ప్రైవసీ మీ మొదటి ప్రాధాన్యం అయితే మీకోసమే డక్‌ డక్‌ గో బ్రౌజింగ్ యాప్‌. ఇతర వెబ్‌ బ్రౌజింగ్ యాప్‌ల తరహాలో ఇందులో చెప్పుకోదగిన ఫీచర్స్‌ లేనప్పటికీ యూజర్‌ డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో ఒక్కసారి మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తే మీ ట్యాబ్స్‌ అన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేస్తుంది. అలానే వెబ్ బ్రౌజింగ్ పూర్తయిన తర్వాత కుకీస్‌ని ఆటోమేటిగ్గా తొలగిస్తుంది. ట్రాకింగ్ స్క్రిప్ట్‌ని కూడా డిఫాల్ట్‌గా బ్లాక్ చేస్తుంది. ఇటీవలే ఈ బ్రౌజర్‌లో ఈ-మెయిల్ ప్రొటెక్షన్‌ కోసం మెయిల్ ఫార్వాడింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీని సాయంతో మీ ప్రైమరీ మెయిల్ ఖాతాలను డక్‌ డక్‌ గో మెయిల్‌కి లింక్‌ చేయాలి. దాంతో మీ మెయిల్‌కు వచ్చే ఖాతాలను డక్‌ డక్‌ గో స్కాన్ చేసి వైరస్, మాల్‌వేర్‌, స్పామ్‌ మెసేజ్‌లను డిలీట్ చేస్తుంది. 


మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ (Mozilla Firefox)

క్రోమ్ తర్వాత ఎక్కువ మంది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇటీవలే ఈ బ్రౌజర్‌లో కీలక మార్పులు చేశారు. ఇందులో కూడా గీకో వ్యూ పేరుతో బ్రౌజర్ ఇంజిన్‌ ఇస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్, లైనెక్స్, మ్యాక్ఓఎస్‌, విండోస్‌లను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ బ్రౌజర్‌లలో ఫైర్‌ఫాక్స్ ఎంతో సురక్షితమైంది. ఇంకా ఇందులో బిల్ట్‌-ఇన్‌ పాస్‌వర్డ్ మేనేజర్ కూడా ఉంది. ఇది యూజర్‌ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుతుంది. వేర్వేరు డివైజ్‌లలో మీరు బ్రౌజర్‌ను ఓపెన్ చేసినా అందులోని లాగిన్‌ వివరాలు మరోచోట బ్రౌజర్‌ ఓపెన్ చేసినప్పుడు సింక్ అయ్యేందుకు క్రాస్‌-ఫ్లాట్‌ఫాం సింకింగ్ అనే ఫీచర్ ఉంది. 


వివాల్డి (Vivaldi)

దీన్ని ఓపెరా మాజీ డెవలపర్స్ రూపొందించారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే వివాల్డిలోని ఫీచర్స్‌ ఈ యాప్‌ను టెక్‌ ప్రియులు ఎంతో దగ్గర చేశాయి. డెస్క్‌టాప్ వెబ్‌ బ్రౌజర్‌లో ఉండే ముఖ్యమైన కీ ఫీచర్స్ ఈ యాప్‌ కింది భాగం ప్యానల్‌లో ఉంటాయి. క్రోమ్ తరహాలోనే డెస్క్‌టాప్, మొబైల్ యాప్ బ్రౌజర్‌ని సింక్‌ చేసుకోవచ్చు. అలానే బిల్ట్‌-ఇన్‌ నోట్స్, ఫుల్‌ వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్స్‌, వేర్వేరు సెర్చ్‌ ఇంజిన్‌ల మధ్య ఫాస్ట్ ట్రాన్సిషన్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా మీరు తరచుగా బ్రౌజ్ చేసే వెబ్‌సైట్ల జాబితాతో ఇంటర్‌ఫేస్‌ని డిజైన్ చేసుకోవచ్చు. 


బ్రేవ్ (Brave)

ప్రత్యేకించి ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం 2016లో బ్రేవ్ బ్రౌజింగ్ యాప్‌ను విడుదలచేశారు. ఇందులో బిల్ట్‌-ఇన్ యాడ్ బ్లాకర్, వెబ్‌సైట్ స్పెసిఫిక్ సెట్టింగ్స్‌ అనే ఫీచర్స్ ఉన్నాయి. దీని సాయంతో యూజర్ ప్రతి వెబ్‌సైట్‌కి బ్రౌజర్ సెట్టింగ్స్‌ని తనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. అన్ని రకాల డొమైన్‌లలో థర్డ్‌ పార్టీ కుకీస్, హెచ్‌టీటీపీఎస్‌లను కూడా బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో ఉన్న అన్ని రకాల బ్రౌజింగ్ యాప్‌లలో బ్రేవ్ వేగవంతమైన, సురక్షితమైన బ్రౌజర్‌. ఇందులో క్రిప్టోకరెన్సీ వాలెట్ ఆప్షన్ కూడా ఉంది. టోర్ కనెక్షన్ ద్వారా బ్రౌజింగ్ చేసేందుకు అనుమతిస్తుంది.    

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని