August Smartphones: కొత్త మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారా?
యూజర్స్ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తుంటాయి.
యూజర్స్ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తుంటాయి. జులైలో వరుస లాంఛ్‌లతో అదరగొట్టిన కంపెనీలు..ఆగస్టులోనూ కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో కొన్నింటి లాంఛ్ అధికారికంగా ప్రకటించగా, ఇంకొన్ని తెలిసిన సమాచారాలు. మరి ఆ మొబైల్స్ ధరెంత?ఎలాంటి ఫీచర్లు ఉంటాయనేది తెలుసుకుందాం.
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ (Infinix Smart 5A)
ఆగస్టు 2న ఇన్ఫీనిక్స్ కంపెనీ బడ్జెట్ శ్రేణిలో కొత్త ఫోన్ విడుదల చేయనుంది. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర రూ. 7,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. 6.52-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. వెనుకవైపు 13ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు అదనంగా 2ఎంపీ కెమెరా ఉంటుందని సమాచారం. 2జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో ఈ ఫోన్ తీసుకొస్తున్నారట. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట.
శాంసంగ్ (Samsung)
శాంసంగ్ కంపెనీ ఆగస్టు 11న స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 అనే కొత్త మోడల్ ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు అంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోన్ తెరిచినప్పుడు 7.55-అంగుళాలు, ఫోన్ మడతబెట్టినప్పుడు 6.23-అంగుళాల డిస్ప్లే ఉంటుందట. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. అలానే స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో మరో వేరియంట్‌ను తీసుకొస్తారని సమాచారం. అలానే బయటివైపు డిస్ప్లేకి 10ఎంపీ కెమెరా, లోపలివైపు డిస్ప్లేకి 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారట. ఈ ఫోన్ 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 25 వాట్ వైర్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట.
అలానే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో 6.9-అంగుళాల ప్రైమరీ కెమెరా, 1.9-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఇస్తున్నారట. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉపయోగించారని సమాచారం. 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారని తెలుస్తోంది. గెలాక్సీ ఎం52 ధర సుమారు రూ. 25,000, ఎఫ్52 ప్రారంభ ధర రూ. 15,000 ఉంటుందని అంచనా. వీటిలో హై-రిఫ్రెష్ రేట్‌తో ఎల్సీడీ డిస్ప్లే ఇస్తున్నారట. ఇవేకాకుండా గెలాక్సీ ఏ12 పేరుతో మరో కొత్త మోడల్‌ను శాంసంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం.
అసుస్ 8జెడ్ (Asus 8Z)
కాంపాక్ట్ డిజైన్‌తో అసుస్ 8జెడ్ పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను ఆగస్టులో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 5.9-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. అడ్రినో 660 గ్రాఫిక్ కార్డ్ ఇస్తున్నారు. వెనకవైపు సోనీ లెన్స్‌తో 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 12 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపీ సోనీ లెన్స్ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ర్యామ్, స్టోరేజ్, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (Realme GT Master Edition)
ఫ్లాగ్షిప్ ఫీచర్లతో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉపయోగించారట. హై-రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే ఇస్తున్నారని సమాచారం. వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. దీని ధర రూ. 25,000 వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో ఈ మోడల్ గేమ్ ఛేంజర్ అవుతుందని రియల్మీ భావిస్తోంది. దీనితోపాటు మైక్రోమాక్స్ ఇన్, రెడ్మీ 10 సిరీస్ వేరియంట్లకు పోటీగా బడ్జెట్ ధరలో రియల్మీ సీ సిరీస్ పేరుతో కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. వీటిని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.
మోటోరోలా (Motorola)
మోటోరోలా కూడా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ని ఆగస్టులో విడుదల చేయనుంది. వీటిలో ఒక ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. వెనక వైపు మూడు కెమెరాలు ఇస్తున్నారట. దీని ధర సుమారు రూ. 20,000 ఉండొచ్చని సమాచారం. మరో మోడల్లో స్నాప్‌డ్రాగన్ 879 ప్రాసెసర్ ఉపయోగించారట. దీని ధర సుమారు రూ. 25,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ మోడల్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేయనున్నారు.
పోకో ఎక్స్3 జీటీ (Poco X3 GT)
కొద్దిరోజుల క్రితం గేమింగ్ ఫీచర్లతో ఎఫ్3 జీటీ మోడల్‌ను పోకో కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఎక్స్3 జీటీ పేరుతో మరో కొత్త మోడల్ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో 6.6-అంగుళాల డిస్‌ప్లేతోపాటు 64ఎంపీ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఇస్తున్నారట.
వివో వీ21 ప్రో (Vivo v21 Pro)
ఈ సిరీస్‌లో వివో ఇప్పటికే వీ21, వీ21ఈ 5జీ మోడల్స్‌ను విడుదల చేసింది. త్వరలో వీ21 ప్రో పేరుతో మరో కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. ఇందులో 6.44-అంగులాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ (Google Pixel 6 Series)
గతంలో వచ్చిన పిక్సెల్ మోడల్స్‌కి భిన్నంగా గూగుల్ పిక్సెల్ 6 , 6ప్రో మోడల్స్‌ని తీసుకొస్తున్నారు. ఇందులో గూగుల్ వైట్‌ఛాపెల్ చిప్‌సెట్‌ను ఉపయోగించారని సమాచారం. ఓఎల్ఈడీ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్/ 512జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో విడుదల చేయనున్నారు. వీటి ధర సుమారు రూ. 55,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
- ఇంటర్నెట్‌డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.