
Upcoming Smartphones: కొత్త మొబైల్స్ వచ్చేస్తున్నాయ్... ఇవిగో వివరాలు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్లను ఉపయోగించే దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. ఇక్కడి వినియోగదారుల్లో ఎక్కువ మంది ఒకటి కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తుంటారు. అందుకే మొబైల్ కంపెనీలు యూజర్లని ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. అలానే ప్రతి ఏటా పండగ సీజన్లో మొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తాయి. మరి ఈ సారి పండుగకి రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఏంటో చూద్దాం.
షావోమి 11 లైట్ 5జీ
ఎంఐ బ్రాండ్‌తో యూజర్స్‌కి చేరువైన షావోమి మరో కొత్త 5జీ ఫోన్‌ని తీసుకురానుంది. షావోమి 11 లైట్ పేరుతో పరిచయం చేస్తున్న ఈ ఫోన్‌ని సెప్టెంబరు 29న భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్లో 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ముందు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్, 8 జీబీ/ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని ప్రారంభ ధర రూ. 32,000 ఉంటుందని అంచనా.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ
భారత్‌లో 5జీ నెట్వర్క్ పరీక్షల దశలోనే ఉన్నప్పటికీ మొబైల్ కంపెనీలు వరుసగా 5జీ మోడల్స్‌ను విడుదల చేస్తున్నాయి. త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇందులో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. ముందు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 5 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
రియల్మీ నార్జో 50
రియల్మీ నార్జో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను సెప్టెంబరు 24న భారత్‌లో విడుదల చేయనుంది. రియల్మీ నార్జో 50 పేరుతో నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. రియల్మీ నార్జో 50, నార్జో 50 ప్రో, నార్జో 50ఏ, నార్జో 50ఐ. వీటిలో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉంటాయని సమాచారం. ధర, ఇతర ఫీచర్లు తెలియాలంటే మాత్రం విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.
మోటో ఈ20 & ఈ40
మోటోరోలా కూడా మరో రెండు కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. మోటో ఈ20, మోటో ఈ40 పేరుతో వీటిని పరిచయం చేయనుంది. మోటో ఈ20 మోడల్ని ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో విడుదల చేశారు. మోటో ఈ20 ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల మ్యాక్స్‌విజన్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరా ఇస్తున్నారు. ముందు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,000 ఉంటుందని అంచనా. అలానే మోటో ఈ40 ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుందట. ఆక్టాకోర్ యూనిసాక్ ప్రాసెసర్ ఉపయోగించినట్లు సమాచారం. 4 జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్కు సపోర్టు చేస్తుంది. ఈ మోడల్‌కి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సివుంది.
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్
గూగుల్ త్వరలో పిక్సెల్ సిరీస్‌లో ఫోల్డింగ్ ఫోన్‌ను తీసుకురానుంది. దీనికి సంబంధించి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది చివర్లో గూగుల్ పిక్సెల్ ఫోల్డింగ్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారట. అయితే ఈ ఫోల్డింగ్ ఫోన్లో కెమెరా, ఇతర ఫీచర్ల గురించిన సమాచారం తెలియాల్సివుంది. మరోవైపు గూగుల్ పిక్సెల్ 6 మోడల్‌ను అక్టోబరు 19 విడుదల చేయనుంది. ఇందులో 6.46 అంగుళాల పంచ్ హలో ఓఎల్ఈడీ డిస్‌ప్లేతోపాటు ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్/512 జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారట.
శాంసంగ్ గెలాక్సీ ఏ73
శాంసంగ్ ఏ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ73 పేరుతో ఈ మోడల్‌ను పరిచయం చేయనున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో ఐదు కెమెరాలు ఇస్తున్నారు. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 12 ఎంపీ, 8 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొస్తున్నారని సమాచారం.
రియల్మీ జీటీ నియో2
రియల్మీ జీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్ ఫోన్న ఈ ఏడాది చివర్లో భారత్‌లో విడుదల చేయనుంది. ఇందులో 64 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఉంటాయని సమాచారం. 12 జీబీ ర్యామ్/ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొస్తున్నారట. ఈ మోడల్ ధర రూ. 30,000 ఉంటుందని అంచనా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.