ఈ ఏడాది సందడి చేయనున్న స్మార్ట్ఫోన్లివే..
మొబైల్ ఫోన్ల విషయానికొస్తే..5జీ టెక్నాలజీ, ఫోల్డింగ్ ఫోన్ల గురించి విపరీతమైన చర్చ నడించింది. దాదాపు అన్ని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేశాయి. మొబైల్ కంపెనీలు కొత్త ఏడాదిలో విడుదల చేసే మోడల్స్ అమ్మకాలపైనే ఆశలు పెట్టుకున్నాయి...
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది మొత్తం కొవిడ్ నామస్మరణతో గడిచిపోయినా.. టెక్ ప్రపంచంలో మాత్రం కొత్త మార్పులొచ్చాయి. ఎన్నో నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని సగటు మనిషికి మరింత చేరువ చేస్తూ రకరకాల యాప్‌లు, వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల విషయానికొస్తే.. 5జీ టెక్నాలజీ, ఫోల్డింగ్ ఫోన్ల గురించి విపరీతమైన చర్చ నడించింది. దాదాపు అన్ని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేశాయి. అయితే ఈ మోడల్స్ కంపెనీలు ఆశించినంతగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మొబైల్ కంపెనీలు కొత్త ఏడాదిలో విడుదల చేసే మోడల్స్ అమ్మకాలపైనే ఆశలు పెట్టుకున్నాయి. మరి 2021లో విడుదల కాబోతున్న కొత్త మోడల్స్ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు? ఆ వివరాలతో కూడిన సమాచారం మీ కోసం..
యాపిల్ ఐఫోన్ 13
గతేడాది చివర్లో ఐఫోన్ 12 సిరీస్‌లో 5జీ మోడల్స్‌తో సందడి చేసిన యాపిల్.. కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త మోడల్స్ తీసుకురానుందట. వీటిలో ఐఫోన్ 13తో పాటు రెండు హై-ఎండ్ ప్రో మోడల్స్, రెండు బడ్జెట్ మోడల్స్ ఉంటాయని సమాచారం. అయితే వీటిలో ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారనే దానిపై పూర్తి సమాచారం లేదు. అంతేకాకుండా ఫోల్డింగ్ ఫోన్ తయారీపై కూడా యాపిల్ దృష్టి సారించిందట. ఇప్పటికే ఈ ఫోన్లో ఉపయోగించే విడిభాగాల కోసం పలు కంపెనీలతో యాపిల్ ఒప్పందం చేసుకుందని సమాచారం.
ఎంఐ 10ఐ
షావోమి కంపెనీ ఎంఐ 10ఐ పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను తీసుకొస్తోంది. జనవరి 5న భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఉపయోగించారట. 6జీబీ/128జీబీ 8జీబీ/128జీబీ వేరియంట్లో లభించనుందని సమాచారం.
శాంసంగ్ ఎస్, ఎమ్, ఎఫ్ సిరీస్
గతేడాది ఆన్లైన్ అమ్మకాల్లో ముందంజలో ఉన్న శాంసంగ్ ఈ సారి కూడా తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫ్లాగ్షిప్ మోడల్స్‌తో పాటు బడ్జెట్ మోడల్స్‌ని విడుదల చేయనుందట. ముందుగా శాంసంగ్ ఎస్ సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21+, గెలాక్సీ ఎస్21 అల్ట్రా ఫ్లాగ్షిప్ మోడల్స్‌ను తీసుకురానుంది. ఫిబ్రవరి నెలలో విడుదల చేసి మార్చి నెల నుంచి అమ్మకాలు ప్రారంభించాలని శాంసంగ్ భావిస్తోందట. అలానే ఎం, ఎఫ్ సిరీస్‌లో 5 బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా 7 అంగుళాల ఇంటర్నల్ డిస్ప్లే, 4 అంగుళాల ఎక్స్టర్నల్ డిస్ప్లేతో జెడ్ ఫ్లిప్ సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తోందని సమాచారం. గెలాక్సీ ఏ సిరీస్‌లో కూడా 5జీ ఫోన్‌ను విడుదల చేయనుందట.
ఎల్జీ
ఎల్జీ కూడా మూడు కొత్త మోడల్స్‌ని విడుదల చేయనుంది. వీటిలో ఒకటి రోలింగ్ డిస్ప్లే కాగా మిగిలిన రెండు ఫ్లాగ్షిప్, బడ్జెట్ మోడల్స్ అని తెలుస్తోంది. ఎల్జీ రెయిన్బో ఫ్లాగ్షిప్ మోడల్ని మార్చి నెలలో విడుదల చేయనున్నారట. రోలింగ్ ఫోన్ డిస్ప్లే 6.8 అంగుళాల నుంచి 7.4-అంగుళాల వరకు జరుపుకోవచ్చు. ఇక ఎల్జీ క్యూ83 బడ్జెట్ మోడల్. దీన్ని కూడా 2021 మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తారని తెలుస్తోంది.
అల్ఫాబెట్ (గూగుల్)
గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ కూడా ఈ ఏడాది ఫోల్డింగ్ మోడల్‌తో పాటు మరో రెండు కొత్త ఫోన్లను తీసుకురానుంది. వీటిలో పిక్సెల్ ఫోల్డింగ్ ఫోన్, పిక్సెల్ 6 మోడల్ని 2021 చివరి త్రైమాసికంలో, పిక్సెల్ 5ఏ మోడల్ని రెండో త్రైమాసికంలో విడుదల చేయనున్నారట.
రియల్మీ ఎక్స్7 సిరీస్
రియల్మీ జనవరి 26న ఎక్స్7, ఎక్స్7 ప్రో పేరుతో రెండు కొత్త మోడల్స్‌ని విడుదల చేయనుంది. 5జీ సపోర్ట్‌తో రానున్న ఈ ఫోన్లలో ఆక్టాకోర్ డైమెన్సిటీ 1000+ (ఎక్స్7 ప్రో), ఆక్టాకోర్ డైమెన్సిటీ 800యూ(ఎక్స్7) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్మీ యూఐ ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారట. ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని సమాచారం. 8జీబీ/ 128జీబీ, 8జీబీ/ 256జీబీ వేరియంట్లో ఈ పోన్లు లభిస్తాయి.
ఒప్పో రోలింగ్ ఫోన్
ఈ ఏడాది ప్రథమార్ధంలో ఒప్పో రెండు ఫోన్లు తీసుకురానుంది. వాటిలో ఒప్పో ఎక్స్ 2021 రోలింగ్ ఫోన్. రెండోది రెనో5 ప్రో+ 5జీ ఫోన్. ఎక్స్ 2021 ఫోన్ డిస్ప్లే 6.7 అంగుళాల నుంచి 7.4 అంగుళాల రోల్ చెయ్యొచ్చు. గతేడాది నవంబరులో ఒప్పో ఈ ఫోన్ టీజర్ విడుదల చేసింది. ఇక రెనో5 ప్రో+ 5జీ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పాటు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారట.
వివో ఎక్స్60 సిరీస్
వివో ఎక్స్60, ఎక్స్60ప్రో పేరుతో రెండు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తోంది. వీటిలో శాంసంగ్ ఎగ్జినోస్ 1080 ప్రాసెసర్‌ను ఉపయోగించారట. ఈ3 అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఆరిజెన్ ఓఎస్ 1.0 ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయట. 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 8జీబీ/128జీబీ, 8జీబీ/256 జీబీ, 12జీబీ/256జీబీ వేరియంట్లో ఈ ఫోన్లను విడుదల చేయనున్నారు.
నోకియా
నోకియా 9.3 ప్యూర్‌వ్యూ మోడల్‌ను ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయనుంది. గతేడాదే ఈ ఫోన్‌ను విడుదల చేయాల్సినప్పటికీ పలు కారణాలతో వాయిదా వేశారు. ఇందులో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ ఉపయోగించారట. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారట. ఇవే కాకుండా భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా కూడా కొత్త ఫోన్లను విడుదల చేయనుందట. అయితే విడుదల తేదీ... ఎన్ని మోడల్స్.. వాటిలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనే దానిపై మాత్రం పూర్తి సమాచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM