Twitter Edit: ట్విటర్‌లో ‘ఎడిట్‌’ వస్తుందంటున్నారు... ఆప్షన్‌ ఇలానే ఉంటుందా?

ట్విటర్‌ ఎడిట్‌ ఫీచర్‌ పనితీరుపై టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌ జాన్‌ మాన్‌చున్‌ వాంగ్‌ కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

Updated : 11 May 2022 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ త్వరలో తీసుకురాబోతున్న ‘ఎడిట్‌ ఫీచర్‌’పై యూజర్లు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ట్విటర్‌ కూడా యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ ఎడిట్‌ ఫీచర్‌ పనితీరుపై టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌ జాన్‌ మాన్‌చున్‌ వాంగ్‌ కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

ట్విటర్‌లో ఎడిట్‌ అంటే... కొత్తగా ట్వీట్‌ వేయడమే అని చెప్పొచ్చు. అయితే ఆ ట్వీట్‌కి కేటాయించిన ఐడీ నెంబరులో మార్పు ఉండదు. అంటే ట్వీట్‌లో ఏమైనా మార్పులు చేస్తే మళ్లీ అదే ఐడీతో కొత్త ట్వీట్‌గా మారుతుందన్నమాట. ఈ క్రమంలో పాత ట్వీట్‌ను దేన్నైనా ఎడిట్‌ చేస్తే కొత్త ట్వీట్‌గా మారి... యూజర్‌ ప్రొఫైల్‌లో టాప్‌లోకి వచ్చేస్తుంది. అయితే, ట్విటర్‌ ఎడిట్‌ ఫీచర్‌ డిజైన్‌ ఎలా ఉండబోతోంది? యూజర్లకు అందుబాటులోకి వచ్చాక ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టత లేదు. కాగా ట్విటర్‌ కొత్తగా తీసుకొస్తున్న ఎడిట్‌ ఫీచర్‌ ప్రయోగాత్మక దశలో ఉందని.. దీనిపై బ్లూ ల్యాబ్స్‌లో పరీక్షిస్తున్నట్లు ట్విటర్‌  ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని