WWDC2021: యాపిల్ ‘కొత్త’ ముచ్చట్లు
ఐవోఎస్ 15 నుంచి మాక్ ఓఎస్ మాంటరే వరకూ చాలా విషయాలు...
యాపిల్ తన డివైజ్‌ల ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో తీసుకొచ్చే కొత్త ఫీచర్లను వివరించడానికి ఏటా వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ( WWDC) నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది WWDCలో ఐవోఎస్ 15, ఐప్యాడ్ ఓఎస్, వాచ్ ఓఎస్, మాస్ ఓఎస్ మాంటిరే గురించి వివరించారు.ఈ ఓఎస్‌ల డెవలపర్ బీటా వెర్షన్‌ను విడుదల చేసేశారు. పబ్లిక్ బీటా వెర్షన్లను వచ్చేనెల విడుదల చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం...
ఐవోఎస్ 15 వివరాలు...
∎ యాపిల్ మొబైల్స్ కోసం కొత్తగా ఐవోఎస్ 15ను సంస్థ అనౌన్స్ చేసింది. ఫేస్‌టైమ్‌ను సర్వీసును సరికొత్తగా మార్చనున్నారు. జూమ్ తరహాలో బ్లర్ బ్యాగ్రౌండ్స్, పోర్ట్రైట్ మోడ్, గ్రిడ్ వ్యూ లాంటి ఫీచర్లు తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఇండివిడ్యువల్ ఫేస్‌టైమ్ కాల్స్‌ను షెడ్యూల్ చేసే ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఫేస్ టైమ్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే విండోస్ వినియోగదారుల కోసం బ్రౌజర్ కంపాటబిలిటీ కూడా ఇస్తున్నారు.
∎ ఐమెసేజ్ యాప్‌లో షేర్డ్ విత్ యూ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నారు. ఐమెసేజ్ ద్వారా యూజర్లకు వచ్చిన లింక్‌లను ఆయా పేర్లతో ఒక దగ్గర సేవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు యూజర్ డోంట్ డిస్ట్రబ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నా... ఆ వ్యక్తికి మెసేజ్ వచ్చినట్లు తెలిసేలా కొత్త ఓఎస్‌లో చేయొచ్చు.
∎ యాక్టివిటీ ఆధారంగా నోటిఫికేషన్స్ విభాగం పని చేస్తుంది. ఫోకస్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్... మీ స్టేటస్ ఆధారంగా నోటిఫికేషన్ ప్రిఫరెన్స్‌ను మారుస్తుంది. అంటే యూజర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్ సెట్టింగ్స్ మారిపోతాయి. అలా వర్కింగ్, వాకింగ్ అనే స్టేటస్లు కూడా ఇస్తారు. అయితే స్టేటస్‌ను యూజర్ మొబైల్లో మార్చుకోవాలి.
∎ కెమెరాలో కొత్తగా లైవ్ టెక్స్ట్ ఆటోమేటిక్ స్కాన్ అనే ఫీచర్ తెస్తున్నారు. గూగుల్ లెన్స్ తరహాలో ఇది పని చేస్తుంది. దీంతోపాటు మెషీన్ లెర్నింగ్ ఆధారంగా ఫొటోలను ఆటోమేటిక్‌గా గ్యాలరీ చేసి పెడుతుంది.
∎ యాపిల్ మ్యాప్స్‌లో త్రీడీ డేటాను యాడ్ చేస్తున్నారు. దీంతో మరిన్ని నగరాలకు చెందిన మ్యాప్స్‌లో అదనపు వివరాలు లభిస్తాయి. దీంతోపాటు యూవీ ఇండెక్స్, గాలి వీచే వేగం, బ్యాగ్రౌండ్స్ మార్పు, నైట్‌టైమ్ మోడ్ లాంటి ఫీచర్ల యాడ్ చేస్తున్నారు.
మ్యాక్ మాంటరే...
∎ మ్యాక్ ఓఎస్‌కు కొత్త వెర్షన్‌ను యాపిల్ అనౌన్స్ చేసింది. దాని పేరు మాంటరే. కాలిఫోర్నియా సెంట్రల్ కోస్ట్‌లో ఉన్న బీచ్ పేరు ఇది. యూనివర్శల్ కంట్రోల్ పేరుతో కీబోర్డు షేరింగ్ ఫీచర్ తీసుకొస్తున్నారు. దీంతో మ్యాక్, ఐప్యాడ్‌కు ఒకే కీబోర్డు, మౌస్‌ను ఏకకాలంలో వినియోగించవచ్చు.
∎ ఐవోఎస్ డివైజ్‌ల స్క్రీన్‌ను ఎయిర్‌ప్లే సాయంతో మ్యాక్‌లో బీమ్ చేయొచ్చు. మ్యాక్ ఓఎస్ కోసం సఫారీ బ్రౌజర్లో మార్పులు చేశారు. ట్యాబ్స్ బుక్మార్కింగ్, గ్రూపింగ్, షార్ట్‌కట్స్ లాంటి కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు.
ప్రైవసీ కోసం...
∎ యాపిల్ డివైజ్‌ల్లో ప్రైవసీని పెంచడానికి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెయిల్ యాప్‌లో ట్రాకర్ బ్లాకర్స్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్ ఐపీ, లొకేషన్ తదితర వివరాలను హ్యాకర్లు తెలుసుకోకుండా చేయడం ట్రాకర్ బ్లాకర్స్ పని. దీంతోపాటు యాప్ ట్రాకర్ రిపోర్ట్ అనే ఫీచర్‌ను జోడిస్తున్నారు. మొబైల్లోని యాప్స్ ఏయే పర్మిషన్ను ఎంతసేపు వాడాయనేది రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
క్లౌడ్ కొత్తగా...
∎ యాపిల్ డివైజ్‌ల డేటా స్టోరేజీ ఐక్లౌడ్‌కు యాపిల్ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రకటించింది. అదే ఐక్లౌడ్ ప్లస్. ఆన్లైన్ ప్రైవసీని మరింత పెంచుతూ కొత్త ఐక్లౌడ్‌ను తీసుకొస్తున్నారు. వీపీఎన్ తరహాలోనే ఈ కొత్త క్లౌడ్ సర్వీసు పని చేస్తుంది.
ఐప్యాడ్‌లో ఇలా...
∎ కొత్త ఐప్యాడ్ ఓఎస్‌లో యాప్స్‌ను రీఅరేంజ్ చేసుకునే ఫీచర్ ఇస్తున్నారు. విడ్జెట్స్ ద్వారా ఈ పని చేయొచ్చు. మల్టీటాస్కింగ్ ఇంటర్ ఫేస్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఐప్యాడ్‌లో రెండు యాప్‌లను ఒకేసారి వాడుకోవచ్చు.
∎ నోట్స్ యాప్‌ను ఆధునికీరిస్తున్నారు. యాపిల్ పెన్సిల్‌తో ఐప్యాడ్ స్క్రీన్ అంచు నుండి పైకి రాస్తే... నేరుగా నోట్స్ యాప్‌ను ఓపెన్ చేసేలా మార్పులు చేస్తున్నారు. దీంతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌లేట్ అయ్యేలా యాప్‌లో మార్పులు చేస్తున్నారు. అంటే వాయిస్‌ను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ చేయొచ్చు.
వాచ్‌లో మార్పులు...
∎ యాపిల్ వాచ్ కోసం కొత్తగా వాచ్ ఓఎస్8ను లాంచ్ చేసింది. ఇందులో ఎప్పటిలాగే కొత్త వాచ్ ఫేస్‌లను యాడ్ చేశారు. వాటితోపాటు కొత్తగా వాచ్‌లో వేలితో టెక్స్ట్ రాసుకునే ఫీచర్‌ను జోడించారు. మైండ్‌ఫుల్‌నెస్ అనే బ్రీత్ యాప్‌ను యాడ్ చేశారు. నిద్రపోయే సమయంలో బాడీ రెసిప్రేటరీ లెవల్స్‌ను ట్రాక్ చేయడం ఈ యాప్ పని.
మరిన్ని వివరాలు కావాలంటే... దిగువ వీడియో చూడండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..