Clouds: మేఘ వైవిధ్యం
మబ్బు లను చూసి నప్పుడు ఒకోసారి జంతువులు, పక్షులు, మనుషుల ఆకారాలు కనిపించటం గమనించే ఉంటారు. ఇలాంటి రూపాలు ఎలా ఏర్పడతాయోననీ ఆశ్చర్యపోయీ ఉంటారు. దీనికి కారణమేంటి?
మబ్బు లను చూసి నప్పుడు ఒకోసారి జంతువులు, పక్షులు, మనుషుల ఆకారాలు కనిపించటం గమనించే ఉంటారు. ఇలాంటి రూపాలు ఎలా ఏర్పడతాయోననీ ఆశ్చర్యపోయీ ఉంటారు. దీనికి కారణమేంటి?
గాలిలో నీటి ఆవిరి రూపంలో తేమ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఘనీభవించి బిందువులుగా లేదా ఘన మంచు రేణువులుగా మారుతుంటుంది. ఈ రేణువులు కాంతిని వెదజల్లటం మూలంగానే అవి మేఘాలుగా మన కంటికి కనిపిస్తాయి. వీటి ఆకారం గాలి ఉష్ణోగ్రత, సాంద్రత, కదలికల మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, సాంద్రతలో తేడాల వల్ల నీటితో కూడిన గాలి చుట్టుపక్కల గాలితో కలవదు. మేఘాలు స్పష్టమైన అంచులతో వివిధ రూపాల్లో కనిపించటానికి కారణం ఇదే. గాలి కదలికలు వీటికి వేర్వేరు రూపాలను కల్పిస్తాయి. ఏ రెండు మేఘాలూ ఒకేలా ఉండవు. కానీ తీరుతెన్నులను బట్టి వీటిని కొన్ని వర్గాలుగా విభజించొచ్చు. క్యుములస్ మేఘాలు ఉబ్బినట్టుగా, దూది మాదిరిగా కనిపిస్తాయి. ఇవి వాతావరణం కింది భాగంలో ఏర్పడతాయి. నీటి ఆవిరి ద్రవంగా ఘనీభవించినప్పుడు కొంత వేడి విడుదలవుతుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉంటే ఈ వేడి కుమ్యులస్ మేఘాలను తేలేలా చేస్తుంది. ఇవి పైకి వెళ్లిపోయి క్యుములోనింబస్ మేఘాలుగా ఏర్పడతాయి. గాలి వేగంగా పైకి లేవటంతో ఏర్పడే ఇవి పెద్దగా, నల్లగా, బురుజు మాదిరిగా కనిపిస్తాయి. కుంభవృష్టిని కురిపిస్తాయి. అదే గాలి ఎక్కువ ప్రాంతంలో పైకి లేచినప్పుడు భారీ పొరల రూపంలో స్ట్రాటస్ మేఘాలు ఏర్పడతాయి. ఇక సిర్రస్ మేఘాలేమో సున్నితంగా ఉంటాయి. పలుచగా ఉండే ఇవి ఎత్తయిన ప్రాంతాల్లో మంచు స్ఫటికాలు ఏర్పడినప్పుడు పుట్టుకొస్తాయి. నెమ్మదిగా కిందికి దిగుతూ గాలి ప్రవాహాన్ని బట్టి అటూఇటూ కదులుతుంటాయి. పొడవైన, ఈకల మాదిరి మేఘాలుగా కనిపిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayodhya Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం!
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత