Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?

స్మార్ట్‌ఫోన్లు నిజ జీవితంలో అతి ముఖ్యమైన, అత్యవసరమైన భాగంగా మారిపోయాయి. బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల వంటివన్నీ వీటితోనే ముడిపడి ఉంటున్నాయి.

Updated : 22 Mar 2023 11:13 IST

స్మార్ట్‌ఫోన్లు నిజ జీవితంలో అతి ముఖ్యమైన, అత్యవసరమైన భాగంగా మారిపోయాయి. బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల వంటివన్నీ వీటితోనే ముడిపడి ఉంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది గానీ దురదృష్టవశాత్తు హఠాత్తుగా చనిపోతే? ఆయా ఖాతాలను చూడటం, ఫోన్‌తో ముడిపడిన సమాచారాన్ని తెలుసుకోవటం కుటుంబసభ్యులకు కష్టమవుతుంది. కొన్నిసార్లు న్యాయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. ఇందుకు సమయం, డబ్బు ఖర్చవుతాయి. వారసత్వ నంబరును (లెగసీ కాంటాక్టు) జోడించుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. దీని ద్వారా నమ్మకమైన వారికి కీలకమైన సమాచారాన్ని చూసుకునే అవకాశం ఇచ్చినట్టవుతుంది. ఈ మెయిళ్లు, బ్యాంకు వివరాలు, ముఖ్యమైన పాస్‌వర్డ్‌ల వంటి వాటి వివరాలను తేలికగా పొందొచ్చు. మరి లెగసీ కాంటాక్టును ఎలా జోడించుకోవాలి?

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో..

* గూగుల్‌ ఖాతాలో సైన్‌ ఇన్‌ అయ్యి, గూగుల్‌ ఇనాక్టివ్‌ అకౌంట్‌ మేనేజర్‌ పేజీలోకి వెళ్లాలి.

* తెర మీద కనిపించే సూచనలను పాటిస్తూ ముందుకు వెళ్లాలి.

* నమ్మకమైన వ్యక్తి నంబరును లెగసీ కాంటాక్టుగా ఎంచుకోవాలి.

* వారికి కీలకమైన సమాచారాన్ని చూసుకోవటానికి అనుమతించాలి.

* దీంతో ఈమెయిల్‌, బ్యాంకు వివరాల వంటి ముఖ్యమైన సమాచారం యాక్సెస్‌ చేసుకోవటానికి వారికి అవకాశం లభిస్తుంది.


ఐఫోన్‌లో..

* ఐఫోన్‌లో సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి, నేమ్‌ మీద తాకాలి.

* పాస్‌వర్డ్‌ అండ్‌ సెక్యూరిటీ మీద తాకితే లెగసీ కాంటాక్ట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

* యాడ్‌ లెగసీ కాంటాక్ట్‌ మీద తాకి నమ్మకమైనవారి నంబరును యాడ్‌ చేసుకోవాలి. ఈ సమయంలో ధ్రువీకరణను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఫ్యామిలీ షేరింగ్‌ గ్రూప్‌లో ఉన్నట్టయితే దానిలోంచి నంబరును ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే వేరొకరినీ ఎంచుకోవచ్చు.

* చూజ్‌ సమ్‌వన్‌ ఎల్స్‌ మీద తాకి కాంటాక్ట్స్‌ జాబితాలోంచి వేరేవారిని ఎంచుకోవాలి. ఈమెయిల్‌ మీద తాకి కూడా కాంటాక్ట్‌ను ఎంచుకోవచ్చు.

* యాక్సెస్‌ టు యువర్‌ డిజిటల్‌ లెగసీ మీద కనిపించే నోటిఫికేషన్‌ను చదవాలి. అనంతరం కంటిన్యూ బటన్‌ మీద ట్యాప్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని