Phone Battery: చిన్న మార్పు.. పెద్ద లాభం
దశాబ్దకాలంగా స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి హై-రిజల్యూషన్ డిస్ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బ్యాటరీ టెక్నాలజీలో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదనే చెప్పుకోవాలి. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటి పనితీరు ఆశించినంతగా లేకపోవడంతో వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు
ఇంటర్నెట్‌డెస్క్: దశాబ్దకాలంగా స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి హై-రిజల్యూషన్ డిస్ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బ్యాటరీ టెక్నాలజీలో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదనే చెప్పుకోవాలి. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటి పనితీరు ఆశించినంతగా లేకపోవడంతో వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మొబైల్ తయారీ కంపెనీలు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసినా ఫోన్ వినియోగం గతంలో కంటే పెరిగిపోవడంతో బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతోంది. అయితే, ఫోన్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మెరుగుపరచుకునే వీలుంది. మరి ఆ మార్పులేంటో.. వాటిని ఎలా చేయాలో చూద్దాం..!
స్క్రీన్ బ్రైట్నెస్
ఫోన్ బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోవడానికి ముఖ్య కారణం స్క్రీన్ బ్రైట్నెస్. ఫోన్ కొన్నవెంటనే ఆటో బ్రైట్నెస్ మోడ్ ఆన్ చేయడం ఉత్తమం. దానివల్ల లైట్ సరిగ్గా లేనప్పుడు లేదా ఇతర సందర్భాల్లో స్క్రీన్ బ్రైట్నెస్ దానంతకదే మారిపోవడమే కాకుండా.. బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపించదు. అలానే బ్రైట్నెస్ ఎక్కువగా ఉన్న వాల్పేపర్లు వాడకపోవడం మంచిది. వీలైతే ఫోన్‌ని డార్క్‌మోడ్‌లో ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నలుపు రంగును చూపించడానికి ఫోన్‌కు ఎక్కువ బ్యాటరీ పవర్ అవసరం ఉండదు.
అడాప్టివ్ బ్యాటరీ
బ్యాటరీపై అధిక భారం పడకుండా ఉండేందుకు గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు పలు చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు పనిచేయకుండా ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కీలక మార్పులు చేసింది. ఇందుకోసం అడాప్టివ్ బ్యాటరీ, బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఒకవేళ మీ ఫోన్లలో ఇవి ఆన్ చేయకుంటే సెట్టింగ్స్‌లో డిస్ప్లే ఆప్షన్‌లోకి వెళ్లి పైన పేర్కొన్న వాటిపై క్లిక్ చేయండి.
స్క్రీన్ టైం
చాలామంది ఫోన్ ఉపయోగించిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయ్యేలా టైమ్ లిమిట్ పెడుతుంటారు. దీనివల్ల కూడా బ్యాటరీ పనితీరు నెమ్మదించే అవకాశం ఉంది. ఇక నుంచి మీ స్క్రీన్ టైమ్ ఔట్‌ను 20 నుంచి 30 సెకన్లకు తగ్గించి చూడండి. దానివల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది. అలానే వైఫై, బ్లూటూత్, మొబైల్ డేటాను అనవసరంగా ఆన్ చేయకండి. ఉదాహరణకు వైఫై ఆగిపోయినప్పుడు మొబైల్ డేటా కనెక్ట్ అవుతుంది కదా అని రెండింటినీ ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది.
వాడకుంటే.. డిలీట్
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి కన్నా ఎక్కువ ఆండ్రాయిడ్ ఖాతాల్లో లాగిన్ అయితే మీ ఫోన్ బ్యాటరీకి ప్రమాదమే. ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి కాంటాక్ట్స్, ఈ-మెయిల్, ఫొటోస్ వంటి డేటాను ప్రతి ఖాతా నుంచి సింక్ చేయాలంటే ఫోన్ బ్యాటరీ ఎక్కువగా వినియోగమవుతుంది. అందుకే మీకు అవసరంలేని ఖాతాలను డిలీట్ చేస్తే డేటా వినియోగం తగ్గి, బ్యాటరీపై భారం తగ్గుతుంది. ఒకవేళ ఖాతాలను తొలగించకూడదు అనుకుంటే ఫోన్లో ఆటో-సింక్ ఆప్షన్ని డిజేబుల్ చేసుకోవడం ఉత్తమం.
బ్యాటరీ సేవింగ్ యాప్‌లు వద్దు
ఇటీవలి కాలంలో బ్యాటరీ సేవింగ్ కోసమంటూ ఎన్నో రకాల యాప్‌లు ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫోన్లో బ్యాంక్గ్రౌండ్ యాప్‌లను పనిచేయకుండా చేయడం లేదా ర్యామ్ క్లీన్ చేయడం మాత్రమే చేస్తాయి. దానివల్ల బ్యాటరీ పనితీరు ఏ మాత్రం మెరుగుపడదు. అంతేకాక, బ్యాటరీ సేవింగ్ కోసమని వాడుతున్న యాప్ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేయడం వల్ల.. మనం ఫోన్ వాడడం ప్రారంభించినప్పుడు ఆ యాప్స్‌ను ఆండ్రాయిడ్ మరోసారి రన్ చేయాల్సి ఉంటుంది. దీంతో రెండు సార్లు ప్రాసెస్ జరిగి బ్యాటరీపై భారం పడుతుంది. అందుకే బ్యాటరీ సేవింగ్ యాప్‌లను ఉపయోగించకపోవడం మేలంటున్నారు నిపుణులు.
వీటితో పాటు యాప్ నోటిఫికేషన్లు, విడ్జెట్లు, ఫోన్ వైబ్రేషన్ వంటి వాటి వినియోగంపై కూడా దృష్టి సారించండి. ఎందుకుంటే వరుసగా వచ్చే నోటిఫికేషన్లు, ఉపయోగంలేని విడ్జెట్లు, వైబ్రేషన్ వంటి వాటి వల్ల బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే అవసరమైన వాటికే నోటిఫికేషన్లు ఎనేబుల్ చేసుకోవాలి. అలానే విడ్జెట్ తరచుగా వాడకుంటే దానిని కూడా తొలగించడం మేలు. దీర్ఘకాలం ఫోన్ వైబ్రేషన్లో ఉపయోగించకపోవడం మంచిది. ఈ చర్యలను పాటించడం వల్ల మీ బ్యాటరీ పనితీరు గతంలో కంటే మెరుగైందో లేదో విశ్లేషించుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్