
Android Apps: సబ్స్క్రిప్షన్ తొలగించకుండా.. అన్ఇన్స్టాల్ చేస్తున్నారా?
ఇంటర్నెట్ డెస్క్: మొబైల్స్‌లో కొన్ని యాప్‌లు ఉచితంగా లభిస్తే.. మరిన్నింటికి సబ్‌స్క్రిష్షన్ (App Subscription) తీసుకోవాలి. అలాగే పలు ఫీచర్లు అన్‌లాక్ చేయాలన్న నెల, లేదా వార్షిక సభ్యత్వం కట్టాలి. ఇలా యాప్‌లకు ఎప్పుడోసారి మనం సబ్స్క్రిప్షన్ తీసు‘కొనే’ ఉంటాం. తర్వాత పలు కారణాల వల్ల వాటిని అన్ఇన్స్టాల్ చేస్తాం. అయితే, ముందుగా సబ్స్క్రిప్షన్ తొలగించకుండా.. యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయడం సరికాదు. లేదంటే యాప్ అన్ఇన్స్టాల్ చేసినా ఛార్జీల వాత అలాగే ఉంటుంది. మరీ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ (Google Play Store) నుంచి యాప్‌లను ఎలా అన్-సబ్‌స్క్రైబ్ (Unsubscribe) చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
1. ముందుగా Google Play Store ఓపెన్ చేసి profile iconపై టాప్ చేయండి.
2. ఆ తర్వాత Payments & subscriptions మెనూలో Subscriptions ఆప్షన్‌లోకి వెళ్లండి.
3. ఇక్కడ మీ యాక్టివ్ సబ్స్క్రిప్షన్ యాప్‌ల జాబితాను సరిచూసుకొని అన్-సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటున్న యాప్‌పై క్లిక్ చేయండి.
4. అనంతరం Manage subscription సెక్షన్లో సబ్స్క్రిప్షన్ వివరాలు చూసి Cancel subscriptionపై క్లిక్ చేయండి.
5. ఆపై యాప్‌ను ఎందుకు అన్ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో కారణం ఎంచుకొని ముందుకు వెళ్లండి.
6. అంతే మీ సబ్స్క్రిప్షన్ తదుపరి బిల్లింగ్ తేదీ తర్వాత యాప్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. తద్వారా సదరు యాప్ నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు ఉండదు.
గూగుల్ ప్లేస్టోర్ వైబ్‌సైట్ నుంచి యాప్‌లను అన్-సబ్‌స్క్రైబ్ చేయాలన్న ఇంచుమించు ఇవే ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వైబ్సైట్లో నేరుగా My subscriptionsలోకి వెళ్లి యాప్‌లను అన్-సబ్‌స్క్రైబ్ చేయవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.