WhatsApp tips: వాట్సాప్‌లో స్టిక్కర్లు.. ఇలా తయారు చేసుకోండి..!

వాట్సాప్‌లో మీ సొంత ఫొటోనే స్టిక్కర్‌గా మార్చడానికి ఇన్‌బీల్ట్‌ ఫీచర్‌ ఉంది. ఇందుకోసం వాట్సాప్‌ వెబ్‌ లేదా పీసీల్లో ముందుగా వాట్సాప్‌ ఖాతాను.. 

Published : 30 May 2022 02:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ యాప్‌లలో ఇప్పుడు స్టిక్కర్‌లదే హవా. టెక్స్ట్‌లు, ఎమోజీలు పక్కనపెట్టి స్టిక్కర్‌లను విరివిగా వాడేస్తోంది నేటి తరం. చెప్పాల్సింది సుత్తి లేకుండా, సూటిగా పంచ్‌లతో, ఫన్నీగా చెప్పడానికి.. వారే స్వయంగా స్టిక్కర్‌లను రెడీ చేసుకుంటున్నారు. ఇందుకోసం చాలా మంది థర్ట్‌-పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నారు. అయితే, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మీ సొంత ఫొటోనే స్టిక్కర్‌గా మార్చడానికి ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ ఉందని మీకు తెలుసా..?లేదంటే వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

స్టిక్కర్ల తయారీ ఇలా..

* ఏదైనా ఫొటోను స్టిక్కర్‌గా మార్చడానికి వాట్సాప్‌ వెబ్‌ లేదా పీసీల్లో ముందుగా వాట్సాప్‌ ఖాతాను లాగిన్‌ చేసుకోవాలి. 

* ఆపై కాంటాక్టుల్లో మీకు నచ్చిన చాట్‌ విండోలకు వెళ్లి.. ‘పేపర్‌ క్లిప్‌’ మాదిరి ఉండే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

* అందులో ‘స్టిక్కర్‌’ ఆప్షన్‌ ఎంచుకోగానే మీకో పాప్‌ అప్‌ ఓపెన్‌ అవుతుంది. 

* ఇక్కడ మీరు స్టిక్కర్‌గా చేయాలనుకునే ఫొటోను సెలెక్ట్‌ చేసుకోవాలి. 

* అంతే, మీకు కావాల్సినట్టుగా ఫొటోను కట్‌ చేసుకొని, దానిపై టెక్స్ట్‌, ఎమోజీలు సర్దుబాటు చేసుకొని సేవ్‌ చేసుకోవచ్చు. 

* తర్వాత మీరు ముందుగా ఓపెన్‌ చేసిన చాట్‌లో ఈ స్టిక్కర్‌ను పోస్టు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని