WhatsApp: డెస్క్‌టాప్‌ వీడియో ‘కాలింగ్‌’ ఇలా

కాలింగ్‌ ఎలా చేయొచ్చు, దాని కోసం ఏమేం అందుబాటులో ఉండాలి అనే వివరాలు ఓసారి తెలుసుకుందాం!

Updated : 22 Jun 2021 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెబ్, డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ ఇటీవల వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాలింగ్‌ ఎలా చేయొచ్చు, దాని కోసం ఏమేం అందుబాటులో ఉండాలి అనే వివరాలు ఓసారి తెలుసుకుందాం!

ఎలా చేయాలంటే..?

 వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

 చాట్‌ చేయాలని అనుకున్నవారిని సెలక్ట్ చేసుకోవాలి. 

వీడియో కాల్‌ ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి.

కాలింగ్‌ సమయంలో మ్యూట్‌, అన్‌మ్యూట్‌ చేయాలంటే మైక్రోఫోన్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి.

అలానే కెమెరాను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసేందుకు కెమెరా ఐకాన్‌ మీద నొక్కాలి.

ఇన్‌కమింగ్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకునేందుకు యాక్సెప్ట్ కాల్‌ బటన్‌.. ఎండ్‌ చేయాలనుకుంటే డిక్లైన్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి.

ఒక వేళ ఇన్‌కమింగ్‌ కాల్‌ ఇప్పుడు ఎత్తకూడదనుకుంటే ఇగ్నోర్ లేదా ఎక్స్‌ టు ఇగ్నోర్ ద కాల్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.


డెస్క్‌టాప్‌లో ఉండాల్సినవి...

డెస్క్‌టాప్ తప్పనిసరిగా విండోస్ 10 64bit వెర్షన్‌ 1903 లేదా కొత్త అప్‌డేషన్‌.. మాక్‌ ఓఎస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌ ఉండాలి. 

డెస్క్‌టాప్‌ వీడియో కాలింగ్‌ చేయాలంటే మైక్రోఫోన్, కెమెరా, స్పీకర్స్‌ తప్పనిసరి.

మంచి ఆడియో కావాలంటే మాత్రం హెడ్‌సెట్‌ను ఏర్పాటు చేసుకోండి.

వర్చువల్‌ ఆడియో, వీడియో డివైజ్‌లు సపోర్ట్‌ చేయవు.

కంప్యూటర్‌ మైక్రోఫోన్‌, కెమెరాను వాడాలంటే వాట్సాప్‌ అనుమతి ఉండాల్సిందే.

డెస్క్‌టాప్‌ ద్వారా గ్రూప్‌ కాలింగ్‌ సదుపాయం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని