ట్విటర్ 2ఎఫ్ అథెంటికేషన్ మార్చుకున్నారా?
ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేదా? అయితే ఎస్‌ఎంఎస్ ఆధారిత టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) సపోర్టు నిలిచిపోయినట్టే.
ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేదా? అయితే ఎస్‌ఎంఎస్ ఆధారిత టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) సపోర్టు నిలిచిపోయినట్టే. దీంతో తమ ఖాతాలను కాపాడుకోవటానికి ఎస్‌ఎంఎస్ కోడ్స్ మీద ఆధారపడేవారు ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవటం తప్పనిసరైంది. కానీ దీనికి నెలకు రూ.900 చందా చెల్లించాలి. అంత డబ్బు చెల్లించటం అందరికీ కుదరకపోవచ్చు, ఇష్టముండకపోవచ్చు. మరి బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే 2ఎఫ్‌ఏ ఆప్షన్‌ను వాడుకునేదెలా? అంతగా చింతించాల్సిన, ఆలోచిచాల్సిన పనేమీ లేదు. ప్రత్యామ్నాయ 2ఎఫ్‌ఏ పద్ధతులనూ ట్విటర్ సపోర్టు చేస్తుంది మరి. ఇందుకోసం..
* ముందుగా ఆథీ, గూగుల్ అథెంటికేటర్, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్, ఏజీస్ అథెంటికేటర్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇవి ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి.
* కంప్యూటర్‌లో ట్విటర్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
* సెక్యూరిటీ అండ్ అకౌంట్స్ ద్వారా సెక్యూరిటీ విభాగంలోకి వెళ్తే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ విభాగం కనిపిస్తుంది.
* ఇందులో ‘టెక్స్ట్ మెసేజ్’ ఆప్షన్ ఎనేబుల్ చేసుంటే డిసేబుల్ చేసుకోవాలి.
* ఇప్పుడు అథెంటికేషన్ యాప్‌ను ఎంచుకొని, గెట్ స్టార్టెడ్ బటన్‌ను నొక్కాలి.
* డౌన్‌లోడ్ చేసుకున్న అథెంటికేషన్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ట్విటర్ వెబ్‌సైట్ మీద కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
* అథెంటికేషన్ యాప్‌లో కనిపించే ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేసి, సెటప్ ప్రాసెస్‌ను కన్‌ఫర్మ్ చేసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Daam: ‘ దామ్’ మాల్వేర్తో జాగ్రత్త: కేంద్రం హెచ్చరికలు
-
Sports News
Rohit Sharma: మేం 25 పరుగులు అదనంగా ఇచ్చాం.. గిల్ వల్లే ఓడాం: రోహిత్ శర్మ
-
World News
USA: అమెరికాలో దీపావళి సెలవు..? కాంగ్రెస్‌లో బిల్లు
-
General News
YS Bhaskar reddy: వైఎస్ భాస్కర్ రెడ్డికి నిమ్స్‌లో చికిత్స
-
Movies News
OTT Movies: వీకెండ్ స్పెషల్.. సబ్‌స్క్రిప్షన్ లేక పోయినా ఉచితంగా ఈ సినిమాలు చూడొచ్చు
-
India News
బ్రిజ్ భూషణ్ మాటలు అర్థం లేనివి.. అతడిని వెంటనే అరెస్టు చేయాలి: రెజ్లర్లకు రామ్‌దేవ్‌బాబా సపోర్ట్