Instagram: ‘ఇన్‌స్టా’పోస్టులు డిలీట్‌ చేశారా?రికవరీ ఎలా మరీ..!

మెటా ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టా డిలీట్‌ చేసిన పోస్టులను తిరిగి 30 రోజుల్లో రికవరీ చేసుకునేలా అవకాశం కల్పించింది. 

Updated : 05 Jan 2022 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉరకలెత్తే యువతరంతో ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఇన్‌స్టాగ్రామ్ (Instagram)‌’ దూసుకెళ్తోంది. తమ నవరస ప్రదర్శనకు యువత ‘ఇన్‌స్టా’ను వేదికగా ఎంచుకుంటున్నారు. పరిమిత నిడివి మేరకు వైవిధ్యంగా ‘రీల్స్‌’ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పోస్టులు, స్టోరీలతో చైతన్యం కలిగిస్తున్నారు. అందుకు తగ్గట్టే మెటా (ఫేస్‌బుక్‌) యాజమాన్యం టీనేజీని ఆకర్షించేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో మన డిలీట్‌ లేదా ఆర్కైవ్‌ చేసిన పోస్టులను మళ్లీ రికవరీ చేసుకోవడం ఎలానో మీకు తెలుసా? ఇందుకోసం మెటా ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్‌ చేసిన పోస్టులను తిరిగి 30 రోజుల్లో రికవరీ చేసుకునేలా అవకాశం కల్పించింది. అదెలాగంటే..

ఇందుకు ముందుగా మీరు మీ ఇన్‌స్టా పేజీలో ప్రొఫైల్‌ ఓపెన్‌ చేయండి. 

ఆ తర్వాత ప్రొఫైల్‌కు కుడివైపు ఉన్న మెనూ (menu icon)పై క్లిక్‌ చేసి కింద ‘సెట్టింగ్స్‌ (Settings)’ లోకి వెళ్లండి.  

ఆపై సెట్టింగ్స్‌ మెనూలో ‘అకౌంట్‌ ఆప్షన్‌ (Account)’ను ఎంపిక చేసుకోండి. 

ఇందులో ‘రిసెంట్లీ డిలీటెడ్‌ (Recently Deleted)’ క్లిక్‌ చేయగానే ఇటీవల మీరు డిలీట్‌ చేసిన పోస్టుల జాబితా మీకు కనిపిస్తుంది.

ఇక్కడ మీరు ఏ పోస్టయితే రికవరీ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్‌ చేయండి.

ఆపై పోస్టు పక్కనే ఉన్న (three-dot icon)పై క్లిక్‌ చేసి.. శాశ్వతంగా తొలగించాలనుకుంటే డిలీట్‌ కొట్టండి.

లేదంటే రికవరీ కోసం రీస్టోర్‌ (restore)పై క్లిక్‌ చేయండి.  

అనంతరం మొబైల్‌ నంబర్‌ లేదా ఈమెయిల్‌కు వచ్చిన ఓటీసీ నిర్ధారించుకొని పోస్టును రికవరీ చేసుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని