Whatsapp: వాయిస్‌ స్టేటస్‌ వాడారా?

వాట్సప్‌ నిరంతరం కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇటీవల వాయిస్‌ స్టేటస్‌ను షేర్‌ చేసే సదుపాయమూ కల్పించింది. దీని ద్వారా వాయిస్‌ క్లిప్‌ను స్టేటస్‌ అప్‌డేట్‌గా సెట్‌ చేసుకోవచ్చు.

Updated : 22 Mar 2023 12:29 IST

వాట్సప్‌ నిరంతరం కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇటీవల వాయిస్‌ స్టేటస్‌ను షేర్‌ చేసే సదుపాయమూ కల్పించింది. దీని ద్వారా వాయిస్‌ క్లిప్‌ను స్టేటస్‌ అప్‌డేట్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఇది మన కాంటాక్టు జాబితాలో ఉన్న అందరికీ కనిపిస్తుంది. వాయిస్‌ స్టేటస్‌ షేరింగ్‌ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మన గురించి మరింత స్వేచ్ఛగా, సృజనాత్మకంగా వ్యక్తీకరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరికొత్తగా ఎంగేజ్‌ కావొచ్చు. ఇతరులకు భిన్నంగా, ఆసక్తికరంగా మన ప్రత్యేకతను చాటుకోవచ్చు. మరి వాయిస్‌ స్టేటస్‌ను ఎలా షేర్‌ చేసుకోవాలో తెలుసుకుందామా..

* ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌లో వాట్సప్‌ను ఓపెన్‌ చేయాలి.

* మధ్యలో కనిపించే స్టేటస్‌ విభాగంలోకి వెళ్లాలి.

* కింద కుడి వైపున ఉండే పెన్సిల్‌ గుర్తు మీద తాకాలి.

* మైకు గుర్తు మీద తాకి, అలాగే నొక్కి పట్టి మాటలను రికార్డు చేయాలి. 30 సెకండ్ల వరకు మాటలను రికార్డు చేసుకోవచ్చు.

* రికార్డయిన మాటలను విని, సమీక్షించుకోవచ్చు. అంతా బాగానే ఉందనుకుంటే సెండ్‌ గుర్తును తాకి షేర్‌ చేసుకోవాలి. అది 24 గంటల వరకు స్టేటస్‌ అప్‌డేట్‌గా ఉండిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని