Whatsapp: వాట్సాప్‌లో ఒకేసారి ‘32 మందితో గ్రూప్‌ కాల్‌’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తీసుకొచ్చిన ‘32 మందితో గ్రూప్‌ కాల్‌’ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..

Updated : 11 May 2022 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం 32 మందితో గ్రూప్‌ కాల్‌ మాట్లాడుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో సింగిల్‌ కాల్‌లో ఒకేసారి 32 మందితో మాట్లాడుకునే అవకాశం ఉంది. మరి ఈ గ్రూప్‌ కాల్‌ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..


ఏడుగురు లిఫ్ట్‌ చేశాకనే..

📌 వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌లో ఒకేసారి 32 మందితో మాట్లాడుకోవాలంటే 33 మంది లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న గ్రూప్‌ అయ్యి ఉండాలి. గ్రూప్‌ కాల్‌ చేసినపుడు ముందు ఏడుగురు కాల్‌ ఆన్సర్‌ చేశాకనే మిగిలిన వారిని గ్రూప్‌ కాల్‌లో యాడ్‌ చేయొచ్చట. 


వాయిస్‌ కాల్‌ మాత్రమే..

📌 వాట్సాప్‌లో ఇంతకుముందు ఒకేసారి 8 మందితో గ్రూప్‌ వీడియో కాల్‌ చేసేకునే వీలు ఉండేది. కానీ, తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్‌లో వాయిస్‌ కాల్‌ మాట్లాడుకునే అవకాశమే ఉంటుందట. వీడియో కాల్స్‌ చేసుకునే వెసులుబాటు లేదని తెలుస్తోంది. 


బ్లాక్‌ చేసిన నెంబర్‌కు కనెక్ట్‌ అవ్వదు..

📌 వాయిస్‌ కాల్‌ మాట్లాడుతున్న సమయంలో వీడియో కాల్‌కు మారే అవకాశం వాట్సాప్‌లో ఉంది. అయితే, వాయిస్‌ కాల్‌ నుంచి వీడియో కాల్‌ మారే సదుపాయం 32 మందితో చేసే గ్రూప్‌ కాల్‌లో లేదని సమాచారం. అంతేకాకుండా బ్లాక్‌ చేసిన కాంటాక్ట్స్‌కు గ్రూప్‌కాల్‌లో మాట్లాడే అవకాశం ఉండేది. అయితే, ఈ ఫీచర్‌లో బ్లాక్‌ అయిన నెంబర్‌కు కాల్‌ కనెక్ట్‌ అవ్వదని తెలుస్తోంది.


హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌..

📌 32 మంది గ్రూప్‌ కాల్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ మెరుగ్గా ఉండాలి. ఇంటర్నెట్‌ స్పీడ్‌పైనే కాల్‌ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది.


అప్‌డేట్ చేసుకోవాల్సిందే..

📌 వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ కోసం ముందుగా వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని