HTC Smartphone: హెచ్‌టీసీ నుంచి తొలి మెటావర్స్ ఫోన్
హెచ్‌టీసీ (HTC) కంపెనీ మెటావర్స్ (Metaverse) సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ సాయంతో యూజర్లు వర్చువల్ రియాలిటీ అనుభూతిని పొందుతారని హెచ్‌టీసీ కంపెనీ తెలిపింది. మరి ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేద్దామా...
ఇంటర్నెట్‌డెస్క్: కొత్త తరం సాంకేతికతతో కూడిన ఫీచర్లను యూజర్లకు అందించడంలో మొబైల్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. తాజా హెచ్‌టీసీ (HTC) కంపెనీ మెటావర్స్ (Metaverse) సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ సాయంతో యూజర్లు వర్చువల్ రియాలిటీ అనుభూతిని పొందుతారని హెచ్‌టీసీ కంపెనీ తెలిపింది. హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో (HTC Desire 22 Pro) పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. మరి ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!
హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు రెండు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 13 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 5 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఇస్తున్నారు. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,520 ఎంఏహెచ్ బ్యాటరీ వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను తైవాన్‌లో మాత్రమే విడుదల చేశారు. ధర 11,990 తైవాన్ డాలర్లు (సుమారు రూ.32,000). త్వరలోనే ఇతర రీజియన్లలో కూడా హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫోన్‌తో మెటావర్స్ ఎలా?
మెటావర్స్ కోసం హెచ్‌టీసీ ఈ ఫోన్‌లో వివేవర్స్ అనే (Viveverse App) యాప్‌ను ఇస్తోంది. యూజర్లు ఈ యాప్ ద్వారా హెచ్‌టీసీ రూపొందించిన వివే ఫ్లో వీఆర్ హెడ్‌సెట్ (Vive Flow VR Headset) సాయంతో సులువుగా మెటావర్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫోన్‌తో ద్వారా 300 అంగుళాల పెద్ద స్క్రీన్‌పై కూడా మెటావర్స్ అనుభూతిని పొందవచ్చని హెచ్‌టీసీ తెలిపింది. ఈ యాప్ ద్వారా వివే అవతార్‌లు, ఎన్‌ఎఫ్‌టీలు, క్రిప్టోకరెన్సీ వంటి వాటిని స్టోర్ చేసుకోవచ్చు.
మెటావర్స్ అంటే?
మనుషుల్ని వర్చువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లే సాంకేతికతనే మెటావర్స్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రపంచం చాలావరకు టెక్స్ట్, ఇమేజెస్, వీడియోల మీదే ఆధారపడి ఉంది. దీనికి భవిష్యత్ రూపమే మెటావర్స్. ఇందులో 3డీ వర్చువల్ స్పేసెస్‌దే కీలక పాత్ర. మెటావర్స్‌లో 3డీ రూపంలో ఒకరితో ఒకరు కలవటం ద్వారా వాస్తవిక ప్రపంచంలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?