వాట్సాప్‌ టు టెలిగ్రాం..చాట్ హిస్టరీ మార్చేయండిలా!

వాట్సాప్‌ కొత్త గోప్యతా విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు డిమాండ్ ఏర్పడింది. గత రెండు వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో యూజర్స్‌ని ఆకట్టుకుని వాట్సాప్‌ తరహా అనుభూతిని అందించేందుకు టెలిగ్రాం, సిగ్నల్ యాప్‌లు ఇప్పటికే పలు రకాల కొత్త ఫీచర్స్‌ని

Updated : 29 Jan 2021 22:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వాట్సాప్‌ కొత్త గోప్యతా విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు డిమాండ్ ఏర్పడింది. గత రెండు వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో యూజర్స్‌ని ఆకట్టుకుని వాట్సాప్‌ తరహా అనుభూతిని అందించేందుకు టెలిగ్రాం, సిగ్నల్ యాప్‌లు ఇప్పటికే పలు రకాల కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేశాయి. కొద్దిరోజుల క్రితం సిగ్నల్ యాప్‌ కస్టమ్‌ వాల్‌పేపర్స్‌, యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని తీసుకొచ్చింది. తాజాగా టెలిగ్రాం ఒకడుగు ముందుకేసి వాట్సాప్‌ నుంచి టెలిగ్రాంకు చాట్ హిస్టరీని మార్చుకునేలా కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఈ మేరకు టెలిగ్రాం 7.4 వెర్షన్‌ను డెవలెప్ చేసింది. ఈ అప్‌డేట్‌తో యూజర్స్‌ సులభంగా వాట్సాప్‌, లైన్‌, కాకోటాక్‌ యాప్స్‌ నుంచి తమ ఖాతాల్లోని ఛాట్‌ హిస్టరీని సులభంగా టెలిగ్రాంలోకి మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు వాట్సాప్‌లోకి వెళ్లి ఎవరి చాట్ హిస్టరీ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ లేదా గ్రూప్‌ ఇన్ఫోపై క్లిక్ చేయాలి. ఇందులో ఎక్స్‌పోర్ట్ చాట్ అనే ఫీచర్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీడియా ఫైల్స్‌ని యాడ్ చేయాలా వద్దా అని పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది. ఎటాచ్‌ మీడియా ఫైల్స్‌పై క్లిక్‌ చేస్తే చాట్ హిస్టరీ మొత్తం ఎక్స్‌పోర్ట్ అవుతుంది. తర్వాత కింద ఆప్షన్స్‌లో టెలిగ్రాం సెలెక్ట్ చేస్తే యాప్‌ ఓపెన్ అవుతుంది. అందులో ఇంపోర్ట్ ఆప్షన్‌పై క్లిక్‌‌ చేస్తే వాట్సాప్‌ చాట్ హిస్టరీ మొత్తం టెలిగ్రాంలోకి మారిపోతుంది. అలానే టెలిగ్రాం కూడా వాట్సాప్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న చాట్ హిస్టరీని ఇంపోర్టెడ్‌ మెసేజెస్‌ పేరుతో చూపిస్తుంది. ఇందులో ఫొటోలు, వీడియోలు కూడా ఉంటాయి. 

ఇవీ చదవండి..

వెబ్‌ వాట్సాప్‌: మరింత పటిష్ఠంగా..భద్రంగా.. 

గూగుల్ కొత్త ఫీచర్స్.. ఇక మ్యాప్స్‌ ప్రాంతీయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని