Smartphones: ఇన్ఫీనిక్స్‌ తొలి 5జీ ఫోన్‌.. 10 సిరీస్‌లో రెడ్‌మీ 2022 మోడల్‌

ఇన్ఫీనిక్స్‌ తొలి 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 10 2022 మోడల్‌ను పరిచయం చేసింది. 

Published : 14 Feb 2022 18:28 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి రానుండటంతో మొబైల్‌ కంపెనీలు వరుస 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్‌లు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ 5జీ మోడల్స్‌ను తీసుకొస్తే, చిన్న కంపెనీలు ఇప్పుడిప్పుడే తమ తొలి మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫీనిక్స్‌ తన తొలి 5జీ ఫోన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. మరోవైపు రెడ్‌మీ 10 2022 మోడల్‌ను అంతర్జాతీయంగా విడుదల చేసింది. మరి ఈ ఫోన్లలో ఫీచర్లు, ధరపై ఓ లుక్కేద్దాం.


ఇన్ఫీనిక్స్‌ జీరో 5జీ

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 240 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌టీపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో డీటీఎస్‌ సరౌండ్ సిస్టమ్‌తో డ్యూయల్ స్పీకర్స్‌ ఉన్నాయి.

ఇన్ఫీనిక్స్‌ జీరో 5జీలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999. ఫిబ్రవరి 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. 


రెడ్‌మీ నోట్ 10 2022

రెడ్‌మీ నోట్‌ 10 2022 ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12.5 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ అడాప్టివ్‌సింక్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 3.0 రీడింగ్‌ మోడ్‌, సన్‌లైట్‌ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2ఎంపీ కెమెరాలు అమర్చారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌, 9 వాట్ రివర్స్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌/ 128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ధర, ఫోన్‌ అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై షావోమి ప్రకటన చేస్తుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని