Published : 12 Nov 2021 23:35 IST

Instagram: ఇన్‌స్టాగ్రాం హెడ్‌కే షాకిచ్చిన సిబ్బంది..

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి ఎంతో వేగంగా జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నకిలీ వార్తల కట్టడికి సామాజిక మాధ్యమ సంస్థలు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు సొంత సంస్థలోని ఉద్యోగులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితే ఇన్‌స్టాగ్రాం హెడ్‌కు ఎదురైంది. సెప్టెంబరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇన్‌స్టాగ్రాం హెడ్ ఆడమ్‌ మోస్సెరీ చనిపోయినట్లు ఒక ఇన్‌స్టాగ్రాం యూజర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్టాగ్రాం సిబ్బంది ఆడమ్ ఖాతాను రద్దు చేశారు. తర్వాత తప్పు తెలుసుకుని ఖాతాను పునరుద్ధరించారు. ఇన్‌స్టాగ్రాం హెడ్‌ ఖాతాపై ఫిర్యాదు చేసిన యూజర్‌కి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉండటంతోపాటు.. సదరు ఖాతా వెరిఫైడ్ కావడం వల్లనే ఆడమ్‌ మోస్సెరీ ఖాతా నిలిపివేసినట్లు సమాచారం.

ఇన్‌స్టాగ్రాంలో కుటుంబసభ్యులు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు ఎవరైనా చనిపోతే వారి ఖాతాలను నిలిపివేయాలని కోరుతూ ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఉంటుంది. ఇదే పద్ధతిని అనుసరించి నకిలీ సంస్మరణ పత్రాన్ని చూపించి సదరు యూజర్‌ ఆడమ్‌ ఖాతా రద్దు చేయాలని ఇన్‌స్టాగ్రాంను కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఇన్‌స్టాగ్రాం సిబ్బంది ఆడమ్‌ ఖాతాను నిలిపివేశారు. ఇన్‌స్టాగ్రాం మాతృ సంస్థ మెటా కూడా ఆడమ్‌ మోస్సెరీ ఇన్‌స్టాగ్రాం ఖాతా కొద్దిసేపు నిలిపివేసినట్లు అంగీకరించింది. ‘‘ఇతర ఇంటర్నెట్‌ సర్వీసుల తరహాలోనే యూజర్స్‌ ఎవరైనా తమ దగ్గరివారు చనిపోయినట్లు ఫిర్యాదు చేస్తే మేం వారి ఖాతాలను నిలిపివేస్తాం. అయితే కొన్నిసార్లు తప్పుడు సమాచారం కారణంగా జీవించి ఉన్న వారి ఖాతాలపై కూడా నకిలీ ఫిర్యాదులు అందుతుంటాయి. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించాం. వారు నకిలీ ఫిర్యాదుల్లో నిజానిజాలను గుర్తిస్తారు’’ అని ఇన్‌స్టాగ్రాం అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఏకంగా కంపెనీ అధినేతకే ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని