ఇతర యాప్స్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ కూడా..

ప్రముఖ షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు అదనపు ఫీచర్లను యాడ్‌ చేస్తూ ఉంటుంది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (e2ee) టెక్నాలజీని...

Published : 10 Mar 2021 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు అదనపు ఫీచర్లను యాడ్‌ చేస్తూ ఉంటుంది. వాట్సాప్‌ యాప్‌లో ఉండే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (e2ee) టెక్నాలజీని ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తీసుకొచ్చేందుకు సిద్ధమైందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆడియో ఫీచర్‌ క్లబ్‌హౌస్‌కు పోటీగా ఇప్పటికే ట్విటర్‌ స్పేసెస్‌ను సిద్ధం చేస్తుండగా.. ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఆడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో ఇలాంటి ఫీచర్‌ ఎప్పటి నుంచో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఆడియో చాట్‌ ఫీచర్‌కు సంబంధించి మొబైల్‌ డెవలపర్‌ అలెసాండ్రో పాలుజీ రెండు స్క్రీన్‌షాట్‌లను ట్వీట్‌ చేశారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీతో హిడెన్‌ స్ట్రింగ్స్‌ ఎనేబుల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఫీచర్‌ టెస్టింగ్‌ ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపారు. షేర్ చేసిన తొలి స్క్రీన్‌షాట్‌ ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఎడమవైపు పైభాగంలో కంపోజ్‌, వీడియో కాల్‌ బటన్‌, మైక్రోఫోన్‌ ఐకాన్‌ ఉంటాయి. రెండో స్క్రీన్‌ షాట్‌ ప్రకారం.. మైక్రోఫోన్‌ను క్లిక్ చేస్తే ‘లోడింగ్‌’ అవుతున్నట్లు కనిపిస్తుంది. మ్యూట్‌, అన్‌మ్యూట్‌ చేయడానికి, ఆడియో రూమ్‌ నుంచి బయటకు వెళ్లిపోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని