Instagram: ఇన్‌స్టాలో కొత్త మినిమమ్ టైమ్‌ లిమిట్‌.. ఎంతో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాలో యూజర్స్‌ గడిపే మినిమమ్‌ టైమ్‌ లిమిట్‌లో మార్పులు చేసింది. 

Published : 28 Feb 2022 01:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫొటో/వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్స్‌కు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాలో యూజర్లు ఎంత సమయం గడుపుతున్నారనేది తెలుసుకునేందుకు వీలుగా పరిచయం చేసిన యువర్ యాక్టివిటీ  (Your Activity) ఫీచర్‌లో మార్పులు చేసింది. గతంలో ఉన్న 10 నిమిషాలు, 15 నిమిషాల టైమ్‌ లిమిట్ స్థానంలో కొత్తగా 30 నిమిషాలను పరిచయం చేసింది. దీంతో ఇన్‌స్టాలో యూజర్‌ గడిపే కనీస కాల పరిమితి (Minimum Time Limit) 30 నిమిషాలుగా మారింది. తర్వాత టైమ్‌ లిమిట్స్‌ వరుసగా 45 నిమిషాలు, గంట, రెండు గంటలు, మూడు గంటలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. పాప్‌-అప్‌ మెసేజ్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ గురించి యూజర్లకు తెలియజేస్తుంది. 

ఈ ఫీచర్‌ కోసం యూజర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఓపెన్‌ చేసి అందులో ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు గీతలపై క్లిక్ చేస్తే మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో యువర్ యాక్టివిటీ ఫీచర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే టైమ్‌ స్పెంట్‌ (Time Spent) సెక్షన్ ఓపెన్ అవుతుంది. అందులో సెట్‌ ఏ రిమైండర్‌ టు టేక్ బ్రేక్స్‌ (Set A Reminder To Take Brakes), సెట్ డైలీ టైమ్‌ లిమిట్‌ (Set Daily Time Limit) ఫీచర్లు కనిపిస్తాయి. వాటిలో సెట్‌ డైలీ టైమ్‌ లిమిట్‌పై క్లిక్ చేస్తే పైన పేర్కొన్న టైమ్‌ లిమిట్స్ ఉంటాయి. మీరు రోజూ ఎంత సమయం ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, ఆ టైమ్‌ లిమిట్‌ను ఎంపిక చేసి ఓకే చేయాలి. తర్వాత ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేసిన తర్వాత టైమ్‌ లిమిట్‌ అయిపోయిన వెంటనే స్క్రీన్‌ మీద నోటిఫికేషన్‌తో యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది.  

కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ‘టేక్‌ ఏ బ్రేక్‌’ (Take A Break) ఫీచర్‌ను పరియం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ మేరకు వినియోగదారులు ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తున్నట్లయితే ఫోన్‌ స్క్రీన్‌పైన టేక్‌ ఏ బ్రేక్‌ అంటూ పాప్‌-అప్‌ మెసేజ్‌ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎంత సమయం బ్రేక్ తీసుకోవాలనే దానికి సంబంధించి టైమ్‌ పరిమితులు (30, 20, 10 నిమిషాలు) కనిపిస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని