Instagram: ఇన్‌స్టా స్టోరీస్‌ @ 15 సెకన్లు కాదు, 60 సెకన్లు!

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌. స్టోరీస్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసేవారి కోసం మెటా సంస్థ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది...

Published : 30 Sep 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌. స్టోరీస్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసేవారి కోసం మెటా సంస్థ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. స్టోరీస్‌లో వీడియో నిడివి సమయాన్ని 15 సెకన్ల నుంచి 60 సెకన్లకు పెంచింది. ఇకపై యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను కూడా ఆస్వాదించవచ్చు. గతంలో ఎక్కువ సమయం ఉన్న వీడియోలు స్టోరీస్‌లో అప్‌లోడ్ చేస్తే, 15 సెకన్ల తర్వాత కట్‌ అయ్యేవి. తర్వాతి భాగం మరో 15 సెకన్ల పార్ట్‌గా అలా వీడియో మొత్తం పార్ట్‌లుగా అప్‌లోడ్ అయ్యేవి. దీంతో వ్యూయర్స్‌ ప్రతి 15 సెకన్లకు అంతరాయంతో వీడియోలను చూసేవారు. తాజా అప్‌డేట్‌తో 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఎలాంటి అంతరాయం లేకుండా యూజర్లు వీక్షించవచ్చు. దీనివల్ల కంటెంట్‌ క్రియేటర్లకు 60 సెకన్ల వీడియోలు ఒకేసారి అప్‌లోడ్ చేయడంతోపాటు, యూజర్లకు ఎక్కువ సమయం ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తుందని  ఇన్‌స్టాగ్రామ్‌ అభిప్రాయపడింది.   

గత కొద్ది నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో కంటెంట్‌ కోసం అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేస్తోంది. గతంలో రీల్స్‌ నిడివి 60 సెకన్లు ఉండగా, దాన్ని 90 సెకన్లకు పెంచింది. దాంతోపాటు ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన 15 నిమిషాలలోపు ఉన్న వీడియోలు ఆటోమేటిగ్గా రీల్స్‌ మారిపోయే ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. ఇవేకాకుండా భద్రతపరంగా కూడా యూజర్లకు మెరుగైన ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి ఆడవాళ్లకు రక్షణ కల్పించేందుకు న్యూడిటీ ప్రొటెక్షన్‌ (Nudity Protection) పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. పిల్లలు ఇన్‌స్టాలో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు పర్యవేక్షించడం కోసం సూపర్‌విజన్‌ (Parental Supervision), సెన్సిటివ్ కంట్రోల్ (Sensitive Control) వంటి ఫీచర్లను తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని