ఇన్‌స్టాగ్రాం కొత్త ఫీచర్..డిలీట్ చేసినా వెనక్కి
ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రాం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని వల్ల యూజర్స్ డిలీట్ చేసిన ఫొటోలను తిరిగి పొందొచ్చు. ‘రీసెంట్లీ డిలీటెడ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్స్ తాము డిలీట్ చేసిన ఫొటోల్లో అవసరమైన వాటిని...
ఇంటర్నెట్ డెస్క్: ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రాం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని వల్ల యూజర్స్ డిలీట్ చేసిన ఫొటోలను తిరిగి పొందొచ్చు. ‘రీసెంట్లీ డిలీటెడ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్స్ తాము డిలీట్ చేసిన ఫొటోల్లో అవసరమైన వాటిని తిరిగి తమ ఖాతాల్లోకి పొందొచ్చని ఇన్‌స్టాగ్రాం తెలిపింది. ఇన్‌స్టా ఖాతాల నుంచి డిలీట్ చేసిన తర్వాత 30 రోజుల వరకు ఈ కంటెంట్ యూజర్‌కి అందుబాటులో ఉంటుంది. ‘‘ రీసెంట్లీ డిలీటెడ్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాం. దీని సాయంతో యూజర్స్ తమ ఫొటోలను డిలీట్ చేసినా సులభంగా తిరిగి పొందగలరు. ఎంతో కాలంగా ఇలాంటి ఫీచర్ కోసం యూజర్స్ నుంచి అభ్యర్ధనలు వచ్చాయి. అలానే డిలీట్ చేసిన సమాచారం హ్యాకర్స్ చేతికి చిక్కకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం’’ అని ఇన్‌స్టాగ్రాం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎలా పనిచేస్తుందంటే..
మీ ఇన్‌స్టాగ్రాం ఖాతా నుంచి డిలీట్ చేసిన ఫొటోలు యాప్‌లో ఉన్న రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్‌లోకి వెళతాయి. అందులో 30 రోజుల వరకు యూజర్‌కి అందుబాటులో ఉంటాయి. తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. అయితే వాటిని తిరిగి పొందేందుకు తమ ఖాతా కచ్చితమైనదేనని యూజర్ ధృవీకరించాలి. ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేస్తే రీసెంట్లీ డిలీటెడ్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు, రీల్స్, ఐజీటీవీ వీడియోలు, స్టోరీలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి రీస్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం యాప్‌ను అప్‌డేట్ చేయాలని ఇన్‌స్టాగ్రాం సూచించింది. దానితో పాటు అన్‌సెండ్ మెసేజెస్ ఫీచర్‌లో మార్పులు తీసుకొస్తున్నట్లు యూజర్స్‌కి పాప్-అప్ సందేశాలు పంపించింది. ఈ మేరకు యూజర్స్ అన్‌సెండ్ చేసిన మెసేజ్‌లు ఇన్‌స్టాగ్రాం విదివిధానాలకు విరుద్ధంగా ఉంటే వాటిని రికార్డులో నమోదు చేస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!