Instagram - Twitter: ఇన్‌స్టాలో నోట్స్‌.. ట్విటర్‌లో వీడియోలు!

యూజర్లకు వీడియోలను అందించడం కోసం ట్విటర్‌ ఫర్‌యూ సెక్షన్‌లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ తరహాలో నోట్స్‌ పేరుతో టెక్ట్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ల పూర్తి వివరాలివే...

Published : 02 Oct 2022 10:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా వేదికలను యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీడియో కంటెంట్ క్రియేట్ చేసే వారితోపాటు, వీక్షించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌ వీడియోల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొస్తే, ఇన్‌స్టాగ్రామ్‌ టెక్ట్స్‌ బేస్డ్‌ ఫీచర్‌ను  పరిచయం చేసింది. ఆ ఫీచర్లేంటో చూద్దాం...

ఫర్‌ యూలో వీడియోలు

 యూజర్లు వీడియోలను ఆస్వాదించేందుకు వీలుగా ట్విటర్‌ సెర్చ్‌ సెక్షన్‌లో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ట్విటర్‌ యాప్‌లో సెర్చ్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి ఫర్‌ యూ సెక్షన్‌లోకి వెళ్లి కిందకు స్క్రోల్ చేస్తే వీడియోస్ ఫర్‌ యూ (Videos For You) సెక్షన్‌ కనిపిస్తుంది. అందులో పాపులర్‌, ట్రెండింగ్ వీడియోలు కనిపిస్తాయి. ఏదైనా వీడియోపై క్లిక్ చేస్తే ఫుల్‌స్క్రీన్‌లో వీడియోను చూడొచ్చు. ఒకవేళ మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే  పక్కకు స్ర్కోల్‌ చేసుకుంటూ వెళ్లాలి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం టిక్‌-టాక్‌లో ఇదే తరహా ఫీచర్‌ ఉంది. 

నోట్స్‌ రాస్తారా..?

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు ‘నోట్స్‌’ (Notes) పేరుతో స్టోరీస్‌ తరహా ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు 60 అక్షరాలతో షార్ట్‌ నోట్స్‌ను క్రియేట్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ మెసేజ్‌ (DM) సెక్షన్‌లో యూజర్లకు కనిపిస్తుంది. 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. యూజర్‌ క్రియేట్ చేసిన నోట్స్‌కు ఇతరుల స్పందన కూడా డైరెక్ట్ మెసేజ్‌ సెక్షన్‌లోనే కనిపిస్తుంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ టైమ్‌ లిమిట్‌ను 15 సెకన్ల నుంచి 60 సెకన్లకు పెంచింది. దాంతోపాటు ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన 15 నిమిషాలలోపు ఉన్న వీడియోలు ఆటోమేటిగ్గా రీల్స్‌గా మారిపోయే ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని