Instagram: మరో రెండు సర్వీసులు మూసేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ఎందుకంటే?
ఇన్‌స్టాగ్రామ్ వీడియో అప్లికేషన్లు బూమేరాంగ్, హైపర్ లాప్స్‌లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తన సొంత వీడియో అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్ ఐజీటీవీ (IGTV)ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో రెండు యాప్ సర్వీస్‌లను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వీడియో అప్లికేషన్లు బూమరాంగ్, హైపర్ లాప్స్‌లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ మూడింటినీ ప్లే స్టోర్ల నుంచి ఏకకాలంలో తొలగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన అప్లికేషన్‌లోనే వీడియో యాప్‌ల్లో ఉన్న అన్నీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. యాప్‌లో ఈ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు సర్వీసులను మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ వీడియో అప్లికేషన్ బూమరాంగ్‌ను 301 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోగా.. హైపర్ లాప్స్ యాప్‌ను 23 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. బూమారాంగ్ యాప్ సర్వీస్‌ను మూసివేసే ముందు రోజే 26వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని ఓ నివేదిక పేర్కొంది. కాగా, మినీ వీడియోలు సృష్టించడానికి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా బూమారాంగ్ యాప్‌ను తీసుకురాగా.. సినిమాటోగ్రాఫిక్ ఎఫెక్ట్‌ని సృష్టించడానికి హైపర్‌లాప్స్ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral Video: పిల్లి కూన అనుకొని చేరదీసిన మహిళ.. చివరికి నిజం తెలియడంతో..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు