
Instagram: కొత్తగా ఇన్స్టా అకౌంట్ తెరుస్తున్నారా? ఇవే రూల్స్
ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా మీరు ఇన్స్టా అకౌంట్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ షరతులు వర్తిస్తాయి అంటూ ఇన్స్టాగ్రామ్ పేర్కొంది. ఇకపై ఇన్స్టా వినియోగదారులందరూ గుర్తింపు ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతిలో మీరు నిజమైన వ్యక్తి అవునో కాదో నిర్ధారించేందుకు ఓ చిన్న సెల్ఫీ వీడియో తీసుకోవాల్సి ఉంటుంది. నకిలీ, స్పామ్ ఖాతాల సంఖ్యను తగ్గించేందుకే ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిందట. ఇన్స్టాగ్రామ్ ఓనర్ మెటా సంస్థ (గతంలో ఫేస్బుక్) దీని గురించి మరింత వివరణ ఇచ్చింది. చిన్న సెల్ఫీ వీడియో పొందుపర్చడం వల్ల ఎటువంటి బయోమెట్రిక్ డేటాను ఇన్స్టా సేకరించదని, ఇది కేవలం గుర్తింపు కోసమేనని ధృవీకరణ కోసమే అని స్పష్టం చేసింది. ఈ రూల్ అనేది కేవలం కొత్త వారికే వర్తిస్తుందని, అకౌంట్ వాడుతున్న వారికి గుర్తింపు కోసం సెల్ఫీ వీడియో ప్రాసెస్ అవసరం లేదంది.
ఇక సెల్ఫీ వీడియో తీసుకునేవారు వారి చిన్న వీడియోలో తలను వివిధ రకాలుగా తిప్పాల్సి ఉంటుంది. తద్వారా మీ మొత్తం రూపురేఖలను గుర్తుపెట్టుకుని మీరు నిజమైన వ్యక్తో కాదో అనేది గుర్తిస్తుంది. ఒక సారి వీడియో రికార్డ్ అయిన తరువాత యూజర్లు అదే వీడియోను మెటాకు నిర్ధారణ కోసం పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో కనిపించదని..30రోజుల్లో సర్వర్స్ నుంచి డిలీట్ చేస్తున్నట్లు పేర్కొంది. సెల్ఫీ వీడియోలను ముఖ గుర్తింపు కోసం ఉపయోగించరని అలాగే బయోమెట్రిక్ డేటాను సేకరించదని కంపెనీ హామీ ఇచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.