Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మ్యాప్స్‌.. ఎలా వాడాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం మెటా సంస్థ మ్యాప్స్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యూజర్లు తమకు నచ్చిన ప్రదేశాల రూట్‌ మ్యాప్‌ను ఇన్‌స్టాలో వెతికేయొచ్చు. 

Published : 22 Jul 2022 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ రెస్టారంట్, ముఖ్యమైన ప్రదేశాల అడ్రస్‌ కోసం గూగుల్ మ్యాప్స్‌ (Google Maps)ను ఆశ్రయిస్తాం. కానీ, జెడ్‌ జనరేషన్‌ (Z Gen) యూజర్లు మాత్రం సోషల్‌ మీడియా యాప్‌లను ఉపయోగిస్తున్నారట. గూగుల్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సువారు రెస్టారంట్‌లు, ప్రముఖ ప్రదేశాల గురించి వెతికేందుకు గూగుల్‌ మ్యాప్స్‌కి బదులుగా సోషల్‌ మీడియా యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్‌ జనరేషన్‌కు మరింత చేరువయ్యేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు తమ దగ్గర్లోని ప్రముఖ ప్రదేశాలు, రెస్టారంట్‌లు, కేఫ్‌లు, బ్యూటీ సెలూన్‌ల అడ్రస్‌తోపాటు రూట్‌ మ్యాప్‌ ద్వారా చేరుకోవచ్చు. 

‘‘ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు పోస్ట్‌లు, స్టోరీస్‌లో ఎన్నో ప్రదేశాలు, రెస్టారెంట్లను ట్యాగ్‌ చేస్తుంటారు. ఈ  సమాచారం ఆధారంగా ఇతరులు ఆయా ప్రదేశాలకు చేరుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్స్‌ ఫీచర్‌ సాయపడుతుంది. యూజర్లు తమకు కావాల్సిన ప్రదేశాల గురించి హ్యాష్‌ట్యాగ్స్‌ సాయంతో కూడా సెర్చ్‌ చేయొచ్చు. యూజర్లు బయటి ప్రదేశాలకు తమ పోస్ట్‌లలో వాటిని ట్యాగ్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ మ్యాప్స్‌ మరింత సమాచారం అందించగలుగుతుంది’’ అని మెటా సంస్థ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత హ్యాష్‌టాగ్‌తో మీకు కావాల్సిన ప్రదేశం లేదా రెస్టారెంట్‌ను సెర్చ్ చేయాలి. తర్వాత మీకు ఆ పేరుతో ట్యాగ్‌ అయిన కొన్ని పోస్టులు కనిపిస్తాయి. వాటిలో ఒకదానిపై క్లిక్ చేస్తే మ్యాప్స్‌ కావాలా అని అడుగుతుంది. దాన్ని ఓకే చేసి ఇన్‌స్టాలో మ్యాప్స్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని