Instagram: ఐజీటీవీ యాప్‌ మూసేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌... ఎందుకంటే?

ఇన్‌స్టాగ్రామ్ తన సొంత వీడియో అప్లికేషన్‌ ఐజీటీవీ (IGTV)యాప్‌ను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Published : 02 Mar 2022 19:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫొటో/వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) యూజర్లకు చేదువార్త చెప్పింది. తన సొంత వీడియో అప్లికేషన్‌ అయినా ఇన్‌స్టాగ్రామ్ ఐజీటీవీ (IGTV)యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లోనే అన్ని వీడియోలు పొందుపర్చేలా యాప్‌ను రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

‘‘రానున్న రోజుల్లో ఐజీటీవీలో ఉన్న ఫీచర్లన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లోనే ఉండేలా అభివృద్ధి చేస్తున్నాం. రీల్స్‌తో ఎలాగైతే వీడియోలు చేస్తున్నారో అదే విధంగా సులభంగా వీడియోలు క్రియేట్‌ చేయడం, యూజర్లు చూసేందుకు అనువుగా యాప్‌ను రూపొందించాలని నిర్ణయించాం. అందుకనే ఐజీటీవీ అప్లికేషన్‌ను మూసివేస్తున్నాం’’ అని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది.

ఇండియాలో చైనా యాప్‌ టిక్‌టాక్ బ్యాన్‌ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ 2020లో రీల్స్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ ప్రస్తుతం షార్ట్ వీడియోలకు ప్లాట్‌ఫామ్‌గా మారింది. అయితే, యూజర్లు రీల్స్‌ని ఇంకా సులభంగా క్రియేట్‌ చేసుకోవడానికి కొత్త ఫీచర్లు ప్రవేశపెడతామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. బోనస్‌లతో పాటు, యాడ్స్‌ల ద్వారా యూజర్లు ఆదాయాన్ని పొందేలా కొత్తగా యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా బ్యానర్లు, స్టిక్కర్ల రూపంలో ఉండే వీడియో మధ్యలో యాడ్స్ వచ్చేలా యాప్‌ను తీర్చిదిద్దనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని