Instagram Reels: ఇన్‌స్టా రీల్స్ కొత్త ఫీచర్.. ఒకేసారి యాక్షన్, రియాక్షన్ ఎలాగంటే?
ఇంటర్నెట్ డెస్క్: ఇన్స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ (Reels) ఫీచర్ ఎంతో పాపులర్. టిక్‌టాక్ (TikTok)కు ప్రత్యామ్నాయంగా పరిచయం చేసిన ఈ ఫీచర్ తక్కువ కాలంలోనే యువతలో క్రేజ్ సంపాదించుకుంది. రీల్స్‌ను ఎక్కువ మందికి చేరువచేయాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవల పరిచయం చేసిన ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో 15 నిమిషాలలోపు నిడివితో అప్లోడ్ చేసిన వీడియోలు ఆటోమేటిగ్గా రీల్స్‌గా మారిపోతాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ డ్యూయల్ (Instagram Dual) పేరుతో తీసుకొస్తున్న ఫీచర్‌తో ఒకేసారి రెండు రకాల వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఉదాహరణకు స్నేహితులు చేస్తున్న రీల్స్‌ను ఫోన్ వెనుక కెమెరాతో రికార్డు చేస్తున్నారు. అలా వీడియో తీస్తూనే సెల్ఫీ కెమెరాతో దానికి మీ స్పందనను రికార్డు చేయొచ్చు. అంటే మీ స్నేహితుల రీల్స్, దానికి మీ స్పందన ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తాయి. వెనుకవైపు కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో పెద్ద స్క్రీన్‌లో, సెల్ఫీ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో చిన్న స్క్రీన్‌లో కనిపిస్తుంది. డ్యూయల్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
- ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైన ఉన్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేస్తే రీల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే రీల్స్ రికార్డ్ చేసేందుకు కెమెరా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ మీద ఎడమవైపు కనిపిస్తున్న ఆప్షన్లలో డ్యూయల్ అనే లేబుల్‌తో ఉన్న కెమెరా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ మొత్తం పూర్తయ్యాక ఎప్పటిలానే దానికి ఎఫెక్ట్స్, మ్యూజిక్ వంటివి యాడ్ చేసుకోవచ్చు.
- ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
ఇన్స్టాగ్రామ్ డ్యూయల్తోపాటు మరో ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం కానుంది. ఇతరులు చేసిన రీల్స్ మీకు నచ్చితే.. వాటిని అనుకరించి అలాంటివే చేసేందుకు వీలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ టెంప్లెట్స్ (Instagram Reels Templates) ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇతరులు క్రియేట్ చేసిన రీల్ చూస్తున్నప్పుడు, అది మీకు నచ్చింది. అలాంటిదే చేసేందుకు సదరు రీల్ చూస్తూ స్క్రీన్ మీద కనిపించే కెమెరా సింబల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన రీల్‌కు ఉన్న మ్యూజిక్, ఎఫెక్ట్స్‌తో ఫొటో/వీడియో యాడ్ చేసి అప్లోడ్ చేస్తే చాలు. రీల్స్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం కోసం ఈ ఫీచర్‌ను పరిచయం చేసినట్లు ఇన్స్టాగ్రామ్ తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Srisailam-Sagar: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
-
Movies News
AlluArjun: బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!
-
India News
India Corona: దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!
-
India News
ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
-
Movies News
Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?