iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
ఇంటర్నెట్‌డెస్క్: యాపిల్ కంపెనీ ఏటా కొత్త మోడల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా సెప్టెంబరులో ఐఫోన్ 14ను తీసుకొస్తోంది. గత ఐఫోన్ మోడల్స్‌కు భిన్నంగా ఐఫోన్ 14లో కెమెరా, ఇతర ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేయనున్నారు. దీంతో ఐఫోన్ 14 విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 12పై అమెజాన్ ఈ-కామర్స్ సంస్థ ప్రైమ్ యూజర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఐఫోన్ 12 ధర సుమారు ₹20 వేల వరకు తగ్గనుంది. మరి ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఐఫోన్ 12 (128 జీబీ వేరియంట్) ధర అమెజాన్‌లో ₹ 69,900గా ఉంది. దీనిపై అమెజాన్ 16 శాతం తగ్గింపు ప్రకటించింది. దీంతో ఫోన్ ధర ₹ 10,901 తగ్గి అమెజాన్‌లో ₹ 58,999కి లభిస్తుంది. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్ ద్వారా ఈఎంఐ ట్రాన్సాక్షన్తో కనిష్ఠంగా ₹ 5,000 పెట్టి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే మరో ₹ 1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్సేంజ్ చేస్తే ₹ 8,950 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్సేంజ్ చేసే సమయానికి ఫోన్ మోడల్, పనితీరు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. దీంతో అన్ని ఆఫర్లు కలిపి మొత్తంగా ₹ 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 12లో 6.1 అంగుళాల ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారు. యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్ ఉపయోగించారు. వెనుకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో ఒక 12 ఎంపీ కెమెరా అమర్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs WI : ఐదో టీ20 మ్యాచ్.. విండీస్‌కు భారత్ భారీ లక్ష్యం
-
Politics News
Cabinet: ఆగస్టు 15కు ముందే ‘మహా’ కేబినెట్ విస్తరణ.. హోంశాఖ ఆయనకేనట?
-
World News
Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?
-
Sports News
INDw vs AUSw : క్రికెట్ ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆసీస్
-
Sports News
CWG 2022 : డబుల్స్ టీటీ.. రజతంతో సరిపెట్టుకున్న భారత్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?