
iPhone 12: ఐఫోన్ 12పై రూ. 17వేల డిస్కౌంట్.. ఇలా పొందండి!
ఇంటర్నెట్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం యాపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 79,900 విలువైన ఫోన్‌ని వివిధ రకాల డిస్కౌంట్ల అనంతరం రూ. 55,900కే అందివ్వనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఐఫోన్ 12ను కూడా తక్కువ ధరకే యూజర్స్ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్స్ ఈ-కామర్స్ సంస్థలు అందించే ధర కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
యాపిల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఐఫోన్ 12 ధర రూ. 59,900. ఒకవేళ మీ వద్ద మంచి కండిషన్లో ఉన్న పాత ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్ మోడల్స్ ఉంటే, వాటికి యాపిల్ అధీకృత డీలర్లు రూ. 18,000 నుంచి రూ. 12,000 ఎక్సేంజ్ ధర ఇస్తున్నారు. ఈ ఆఫర్ ద్వారా కొనుగోలుదారుడు రూ. 12,000 డిస్కౌంట్ లభిస్తే ఐఫోన్ 12 అసలు ధర రూ. 47,900కి తగ్గుతుంది. దీనితోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉండి ఈఎంఐ ద్వారా ఐఫోన్ 12 కొనుగోలు చేసేవారికి రూ. 5,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారుడికి మొత్తంగా రూ. 17,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలా ఐఫోన్ 12ను రూ. 42,900కే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైన పేర్కొన్న ఐఫోన్ మోడల్స్‌ని ఎక్సేంజ్ చేయకుంటే మాత్రం ఈ ఆఫర్ మీకు వర్తించదు. అలానే మీ పాత ఫోన్‌కి గరిష్ఠంగా రూ. 18,000 డిస్కౌంట్ లభించినా మరో రూ. 6,000 ధర తగ్గే అవకాశం ఉంది. ఆఫర్ కోసం 👉లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
ఐఫోన్ 12 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 64జీబీ వేరియంట్ ధర రూ. 59,990 కాగా, 128 జీబీ వేరియంట్ ధర రూ. 64,900. ఇక 256 జీబీ మోడల్ ధర రూ.74,900. ఇందులో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారు. యాపిల్ ఏ14 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. నీటిలో తడిచినా పాడవకుండా ఐపీ68 రక్షణ ఉంది. ఈ ఫోన్లో మూడు కెమెరాలున్నాయి. వెనుక 12 ఎంపీ వైడ్, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు, ముందుభాగంలో కూడా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఐఓఎస్ 15తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.